అన్నామలై శపథం.. అప్పటివరకు చెప్పులు వేసుకోరట

ఈ నేపథ్యంలో అన్నామలై సంచలన శపధాన్ని చేశారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే రోజు వరకు తాను చెప్పులు ధరించనంటూ తేల్చేశారు.

Update: 2024-12-28 05:25 GMT

తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వరుస పెట్టి వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఈ ఫైర్ బ్రాండ్ నేత ఏం చేసినా సంచలనమే. తమిళనాడులోని ప్రఖ్యాత అన్నా యూనివర్సిటీలో ఒక విద్యార్థిపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆ రాష్ట్రంలో ప్రకంకపనల్ని క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అన్నామలై సంచలన శపధాన్ని చేశారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే రోజు వరకు తాను చెప్పులు ధరించనంటూ తేల్చేశారు.

కోయంబత్తూరులోని మీడియా సమావేశంలో మాట్లాడిన అన్నామలై.. డీఎంకే సర్కారు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అన్నా వర్సిటీ విద్యార్థి లైంగిక వేధింపుల కేసుపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టారు. దీనిపై తన నిరసనను వ్యక్తం చేశారు. స్టాలిన్ ప్రభుత్వాన్ని దించే వరకు తాను చెప్పులు వేసుకోనన్న ఆయన.. చెప్పులు వేసుకోకుండానే తాను నడుస్తానని తేల్చారు. ఇప్పటికే ఎన్నికల్లో డబ్బులు ఆశగా చూపనని తేల్చిన ఆయన.. రూపాయి పంచకుండానే ఎన్నికలకు వెళతామని చెప్పటం తెలిసిందే.

అంతేకాదు.. చెడు అంతం కావాలని పేర్కొంటూ తన నివాసంలో కొరాడా దెబ్బలతో మురుగున్ కు మొక్కు చెల్లించుకుంటానని చెప్పిన ఆయన.. అంత పని చేసి చూపించారు. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ఆరు మురుగన్ క్షేత్రాల్ని దర్శించుకునేందుకు 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేస్తున్నట్లుగా ప్రకటించటం తెలిసిందే. ఇలా.. ఒకదానికి మించి మరొకటి అన్నట్లుగా చేస్తున్న వ్యాఖ్యలు అన్నామలై.. తమిళనాడులో హాట్ టాపిక్ గా మారారని చెప్పక తప్పదు.

Tags:    

Similar News