ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఏపీ కూటమి సర్కారు చేసిన అప్పు లెక్క!

సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు చేస్తున్న అప్పుల లెక్క అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

Update: 2024-12-28 05:30 GMT

సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు చేస్తున్న అప్పుల లెక్క అంతకంతకూ ఎక్కువ అవుతోంది. అప్పులు చేయకుండా పాలనా రథాన్ని నడిపించటం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమయ్యే పని కాదు. కాకుంటే.. తాను అధికారంలోకి వస్తే సంపదను అదే పనిగా క్రియేట్ చేస్తానన్న చంద్రబాబు మాటలకు భిన్నంగా ఈ ఏడాది సాగింది.

అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు (సుమారు ఆర్నెల్ల వ్యవధిలో) చేసిన అప్పులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఆర్నెల్ల వ్యవధిలో చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు రికార్డుగా మారుతున్నట్లుగా చెబుతున్నారు. బడ్జెటరీ అప్పులు రూ.74,872కు చేరుకున్నట్లుగా చెబుతున్నారు. రిజర్వు బ్యాంక్ సెక్యూరిటీస్ వేలం ద్వారా తాజాగా మరో రూ.5 వేల కోట్లు అప్పు చేయటానికి రెఢీ అవుతున్నారు.

అధికారంలోకి వచ్చింది మొదలు అప్పుల మీదనే ఫోకస్ చేశారన్న విమర్శను ఎదుర్కొంటున్నారు. కూటమి సర్కారు హయాంలో బడ్జెట్.. బడ్జెట్ యేతర అప్పులు ఏకంగా రూ.74,590 కోట్లకు చేరినట్లుగా చెబుతున్నారు. బడ్జెట్ అప్పులే నవంబరు వరకు రూ.65,590 కోట్లుగా కాగ్ నివేదిక వెల్లడించింది. మరోవైపు ప్రభుత్వ గ్యారెంటీతో బడ్జెటేతర అప్పులు మరో రూ.9వేల కోట్లకు ఎగబాకాయి.

రాజధాని అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంకు.. హడ్కో.. జర్మనీకి చెందిన కేఎఫ్ డబ్ల్యూ సంస్థ నుంచి భారీగా అప్పులు చేస్తున్నారు. ఈ లెక్కనే రూ.31 వేల కోట్లు అప్పు చేసేందుకు మంత్రి వర్గం ఓకే చేసింది. ఈ మేరకు సీఆర్ డీఏకు మున్సిపల్.. పట్టణాభివ్రద్ధి శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అప్పుల పయనం ఎంతవరకు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇలా అప్పులు చేసుకుంటూ పోయే కన్నా.. దాని కట్టడికి తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని చంద్రబాబు వివరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News