బీజేపీ నుంచి పోటీలో గాలిజనార్దన్ రెడ్డి..?

Update: 2018-03-28 17:13 GMT

పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల సంద‌డి వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు బీజేపీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయి. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా - కాంగ్రెస్ ర‌థ‌సార‌థి రాహుల్ గాంధీ దూకుడు పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. ఇలా అగ్ర‌నేత‌ల హ‌ల్‌ చ‌ల్ ఓవైపు కొన‌సాగుతుండ‌గా...ఈ ఎన్నికలకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ప్రముఖ వ్యాపారవేత్త - ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితుడు గాలిజనార్దన్ రెడ్డి కర్నాటక ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచే పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. మాజీ మంత్రి - మైనింగ్ బ్యార‌న్‌ గాలిజనార్దన్ రెడ్డి బళ్లారి నుంచి బీజేపీ టికెట్‌ పై పోటీచేయ‌నున్నార‌ని మీడియాలో వార్త‌లు హ‌ల్‌ చ‌ల్ చేస్తున్నాయి. ఈ మేర‌కు ఆయన సోదరుడు సోమశేఖర్ రెడ్డి వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై గాలిజనార్దన్ రెడ్డి నుంచి కానీ - బీజేపీ పార్టీ నుంచి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో గాలిజనార్దన్ రెడ్డి పోటీపై అంతటా ఆసక్తి నెలకొంది. కాగా, గ‌త బీజేపీ  ప్ర‌భుత్వంలో ఆయ‌న మంత్రిగా ప‌నిచేసిన సంగ‌తి తెలిసిందే.

కాగా, గాలి జ‌నార్ద‌న్ రెడ్డి త‌న పొలిటిక‌ల్ ఎంట్రీకి ఇప్ప‌టికే రంగం సిద్ధం చేసుకున్నారని వార్త‌లు వ‌చ్చాయి. త‌న 25వ వివాహ వార్షికోత్స‌వ వేడుక‌ల‌ను పొలిటిక‌ల్ రీ ఎంట్రీ ఎంచుకున్నారని వార్త‌లు వ‌చ్చాయి. 25వ వివాహ వార్షికోత్సవ వేడుకలను కుటుంబ సభ్యులు - బంధువులు - స్నేహితులు - శ్రేయోభిలాషుల సమక్షంలో సొంత ఊరు బళ్లారిలో నిర్వహించుకోవడానికి అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో గాలి జనార్దన్ రెడ్డి పిటిష‌న్ పెట్టుకున్నారు. దీన్ని విచారించిన న్యాయస్థానం అందుకు అవకాశం కల్పించింది.  గ‌త ఏడాది జూన్ 1 నుంచి నాలుగు రోజుల పాటు బ‌ళ్లారికి వెళ్లి అట్ట‌హాసంగా ఈ వేడుక‌లు జ‌రుపుకున్నారు.
Tags:    

Similar News