తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది అనేది బయటి వాళ్లకు అంతబట్టని వ్యవహారంగా మారింది. ఆ పార్టీ నుంచి నేతలు వరసగా బయటకు క్యూ కడుతున్నారు. ఒకరు కాదు - ఇద్దరు కాదు.. అనేక మంది నేతలు వరసగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష వాసం ఏమీ కొత్త కాదు. గతంలో పదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండింది. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగిన నేతలు ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ ఉండటం ఒకింత ఆశ్చర్యకరంగా మారుతూ ఉంది.
అలాగే కులాభిమానంతోనో - మరో రకంగా చంద్రబాబుతో లబ్ధి పొందడం వల్లనో కొంతమంది నేతలు తెలుగుదేశం కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పుడు అలాంటి వారు కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేందుకు వెనుకాడటం లేదు. స్థానిక ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి అనేక రాజీనామాలో నమోదు అయ్యాయి.
వాటి కన్నా ఒకింత సంచలన అంశం ఏమిటంటే.. ఆ పార్టీకి ఎంపీ గల్లా జయదేవ్ రాజీనామా చేయనున్నారు అనేది! తెలుగుదేశం పార్టీని వీడటానికి గల్లా జయదేవ్ రెడీ అవుతున్నారని - మార్చిలోనే ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి లోక్ సభలో ఉన్న ముగ్గురు ఎంపీల్లో ఒకరు గల్లా జయదేవ్ అనే విషయాన్ని వేరే చెప్పనక్కర్లేదు. ఈయన చంద్రబాబు నాయుడుకు బాగా దగ్గర మనిషి అనే ప్రచారం ఉంది. అయితే వీరు ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. జయదేవ్ తల్లి గల్లా అరుణకుమార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే జయదేవ్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యింది మాత్రం తెలుగుదేశం లోనే - ఎంపీ అయ్యిందీ టీడీపీలోనే. ఎంపీ హోదాలో చంద్రబాబు నాయుడుకు బాగా దగ్గరయ్యారు గల్లా జయదేవ్.
మరి ఇప్పడు తెలుగుదేశం పార్టీ కి ఆయన కూడా రాజీనామా చేస్తే - తెలుగుదేశం పార్టీ అది షాకింగ్ అవుతుంది. ఇన్నాళ్లూ గల్లా జయదేవ్ ను సూపర్ హీరోగా అభివర్ణించింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆయనే తెలుగుదేశం పార్టీని వీడితే.. ఆ పార్టీ ఏమంటుందో!