నిన్నటి ఐపీఎల్ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ పై ఆర్సీబీ సునాయాసంగా గెలుపొందింది. ఆర్సీబీ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్ వెల్ చెలరేగి ఆడటం.. ఏబీ డివిలియర్స్ మెరుపులు మెరిపించడంతో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో పరుగుల మోత మోగిపోయింది. 204 పరుగులు సాధించి రికార్డు సృష్టించింది.
అయితే ఈ మ్యాచ్ లో కోల్‌కతా కెప్టెన్ మోర్గాన్‌పై విమర్శలు వచ్చాయి. అతడు బౌలర్లతో సరైన పద్ధతిలో బౌలింగ్ వేయించకపోవడం వల్ల భారీ స్కోర్ ఆర్ సీబీ భారీ స్కోరు చేసిందని కేకేఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే మోర్గాన్ కెప్టెన్సీపై కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ కూడా విమర్శలు గుప్పించాడు. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టిన వరుణ్ చక్రవర్తిని .. కెప్టెన్ మోర్గాన్ సరిగ్గా వాడుకోలేకపోయాడని.. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడని విమర్శించాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ప్రారంభంలోనే చిక్కుల్లో పడింది. విరాట్ కోహ్లీ, పాటిదార్ వెంటవెంటనే అవుట్ అయ్యారు. వరుణ్ చక్రవర్తి వాళ్లను పెవిలియన్ బాట పట్టించాడు. వరుణ్ వేసిన తొలి ఓవర్ లోనే ఇద్దరు ఓపెనర్లను అవుట్ చేశాడు. అయినప్పటికీ కెప్టెన్ మోర్గాన్ వరుణ్ కు బౌలింగ్ ఇవ్వకుండా.. వేరే బౌలర్లతో వేయించాడు. దీంతో మ్యాచ్ చేజారి పోయిందని గంభీర్ విమర్శించాడు.
మ్యాక్స్‌వెల్ (78; 49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదిరిపోయే ఇన్నింగ్స్ తో అలరించాడు. ఆపై ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఏబీ డివిలియర్స్ (76 నాటౌట్; 34 బంతుల్లో 9 ఫోర్లు, 3సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో స్కోరు రెండొందలు దాటింది.
వరుణ్ చక్రవర్తికి సరైన టైంలో బౌలింగ్ ఇచ్చిఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదని గంభీర్ అభిప్రాయపడ్డాడు. 'మోర్గాన్ లాంటి చెత్త కెప్టెన్ ను నా జీవితంలో చూడలేదు. ఎవరైనా బౌలర్ రెండు వికెట్లు తీస్తే.. ఆ తర్వాత అతడికి బౌలింగ్ ఇస్తాం. కానీ వేరేవాళ్లకు ఇవ్వడమంటే అది మూర్ఖత్వమే. వరుణ్‌కు బౌలింగ్ ఇచ్చి ఉంటే మ్యాక్స్‌వెల్ ను అవుట్ చేసి ఉండేవాడు. అప్పుడు ఆర్సీబీ చిక్కుల్లో పడేది. ఈ స్థాయి భారీ స్కోర్ వచ్చేది కాదు’ అంటూ గంభీర్ చురకలు అంటించాడు.