హైదరాబాద్ లో కరోనా అలజడి రోజురోజుకి పెరిగిపోతుంది. గురువారం ఒక్కరోజే 50 పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపింది. తాజాగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సిబ్బందికి కూడా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయినట్టు ప్రసార మాధ్యమాల్లో ఒక వార్త వైరల్ అవ్వడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గాంధీ మెడికల్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది.
దీనితో మెడికల్ కాలేజీలో ఉన్న వైరాలజీ ల్యాబ్ లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ అక్కడ పీపీఈ కిట్లను ఉపయోగించడంతోపాటు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. దీంతో అసలు అతనికి కరోనా ఎలా సోకిందనే విషయమై వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. కరోనా బాధితుడు హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నాడని - తెలిసి అతడి కుటుంబ సభ్యుల నుంచి కూడా శాంపిళ్లను సేకరించి టెస్ట్ కు పంపించారు.
ఈ బాధితుడిని కలిసిన వారిలో ఒక ప్రొఫెసర్ కూడా ఉండటంతో - మెడికల్ కాలేజీలో పని చేస్తున్న వారు కూడా భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, మెడికల్ కాలేజీ సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. అలాగే , ఆయన ఎవరెవర్ని కలిశాడనే దిశగా అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 726 కేసులు నమోదయ్యాయి. 18 మంది ప్రాణాలు కోల్పోయారు.