నెహ్రూ గాంధీ ఫొటోతో మోడీ ర‌చ్చ‌

Update: 2017-01-17 17:46 GMT
జాతీయ ఖాదీ గ్రామోద్యోగ్ సంస్థ‌ క్యాలండర్ కవర్ పేజ్ మీద జాతిపిత మ‌హాత్మ‌ గాంధీ ఫోటో బ‌దులుగా ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ ప్ర‌చురించ‌డం రచ్చ‌ర‌చ్చ‌గా మారుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై విప‌క్షాల విమ‌ర్శ‌లే కాదు ఔత్సాహిక నెటిజ‌న్ల‌ చుర‌క‌లు సైతం పేలుతున్నాయి. మోడీ, బీజేపీ విమ‌ర్శ‌కుల సృజ‌నాత్మ‌క‌త సైతం వీటిల్లో పెద్ద ఎత్తున బ‌య‌ట‌కు వ‌స్తోంది. తాజాగా సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో ఇందుకు నిద‌ర్శ‌నం. జాతిపిత మ‌హాత్మ‌గాంధీ, దేశ మొద‌టి ప్ర‌ధాన‌మంత్రి జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ అంటే ట‌క్కున గుర్త‌కు వ‌చ్చే ఫొటోను మార్ఫ్ చేసి మోడీని మ‌ధ్య‌లో ఇరికించి త‌మ సృజ‌నాత్మ‌క‌త‌ను చాటుకుంటున్నారు.

గాంధీజి, నెహ్రూ అంటే వెంట‌నే గుర్తుకు వ‌చ్చేలా ఉన్న పై ఫొటోను ప్ర‌ధాన‌మంత్రి మోడీ,బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా తో క‌లిపి ఈ టెక్నాల‌జీ ప్రియులు న‌క‌లు సృష్టించారు. దీన్ని సోష‌ల్ మీడియాలో పెట్ట‌గానే లైకులు, షేర్ల‌తో ర‌చ్చ‌రచ్చ‌గా మారిపోయింది. ఇంత‌కీ ఇలా ఎందుకు చేశార‌య్య అంటే దేశంలో దేన్నైనా మార్చివేసేలా ప‌రిస్థితులు ఉన్నాయని పేర్కొంటూ అందుకే తాము ఇలా కొత్త ఫొటో ఒక‌టి సృష్టించామ‌ని అంటున్నారు. ఇపుడు దేశంలో ప్ర‌ధాన‌మంత్రి మోడీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు త‌ల‌చుకుంటే కానిది, మార్చేయ‌లేనిది ఏదీ లేద‌ని  వారు పేర్కొంటున్నారు. ఇంత‌కీ ఇది ఎవ‌రి ప‌ని అని తేల్చే ప‌నిలో బీజేపీ టీం ఉంద‌నేదే వేరేగా చెప్పాలా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News