మహిళలకు రక్షణ కరువైపోయింది...వారిపై ఆకృత్యాలు సాగుతున్నాయి...అబలలకు అండగా చట్టాలు అమలు చేయండి...అంటూ మహిళా సంఘాలు...అభ్యుదయవాదులు..కొన్ని సందర్భాల్లో పాలకులు మొత్తుకుంటున్నపటికీ....కొన్ని ఉదంతాలు చూస్తుంటే...పోలీసులు సరైన రీతిలో స్పందించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇందుకు తాజా నిదర్శనం...ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఉదంతం. ఓ అభాగ్యురాలు తనపై అత్యాచారయత్నం జరిగింది కేసుపెట్టండి అన్ని మొత్తుకుంటే పోలీసులు వినకపోవడంతో...ఆమె బలత్కారం జరిగిన సమయంలో దుండగుడి కొరికేసిన చెవిని సాక్షంగా చూపిస్తే..అప్పుడు కేసు పెట్టారు ఆ రక్షక భటులు!!
ఉత్తరప్రదేశ్ లోని గోండా గ్రామానికి చెందిన బాధితురాలు తన ఇంట్లో పిల్లలతో కలిసి నిద్రిస్తున్న వేళ...పొరుగు ఇళ్లల్లో ఉండే నలుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి ఆమెపై లైంగిక దాడి చేయబోయారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో వాకిట్లో పడుకున్న భర్త లోపలికి వచ్చాడు. అయితే...ముగ్గురు దుండగులు ఆయనపై పడి పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఇదే సమయంలో మరొకడు ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో హతాశురాలైన అభాగ్యురాలు...ఆ దుండగుడి చెవిని కోరికేసింది. దీంతో వాడితో సహా మిగతావారు లబోదిబోమంటూ అక్కడి నుంచి వెళ్లిపోతూనే...ఈ విషయం చెపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు.
అయితే బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి చెప్పుకోగా...ఆమెను మరింత షాక్కు గురిచేసేలా....పోలీసులు కేసు నమోదు చేసుకోలేదు. దీంతో ఇంటికి తిరిగి వచ్చిన అభాగ్యురాలు ఏం చేయాలో పాలుపోక...బలత్కారయత్నం జరిగిన సమయంలో తాను కొరికేసిన చెవిని తీసుకొని...ఏకంగా ఎస్పీ వద్దకు వెళ్లింది. ప్రత్యక్ష సాక్ష్యాన్ని ఆమె తీసుకురావడంతో వెంటనే కేసు నమోదుకు ఎస్పీ ఆదేశించారు. తొలుత ఆమె ఫిర్యాదు నమోదు చేయని పోలీసులను గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
కొసమెరుపుః అత్యాచారయత్నానికి పాల్పడిన దుండగులు మరింత బరితెగించి....సదరు బాధితురాలి భర్త తమపై దాడికి పాల్పడ్డారని కేసు పెట్టారు. ఇందులో సదరు చెవిని కోల్పోయిన వాడు కూడా ఉన్నాడు!