సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. దేశంలో మహిళల రక్షణ ఎండమావే అవుతోంది. తెలంగాణలో గ్యాంగ్ రేప్ ఘటన మరువకముందే మధ్యప్రదేశ్ లో మరో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ నకు పాల్పడడమే కాకుండా ఇద్దరు వ్యక్తులు ఆ దారుణాన్ని తమ స్నేహితుడికి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూపించడం విస్తుగొలుపుతోంది.
జూన్ 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. శుక్రవారం బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితులు పరారీలో ఉన్నారన్న పోలీసులు వారి పేర్లను మాత్రం బయటపెట్టలేదు. బాలికపై జరిగిన ఈ ఘోరంపై కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి రాజీవ్ గుప్తా వివరించారు.
జూన్ 2న ఇద్దరు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దాదాపు 21 ఏళ్లు వయసున్న ఇద్దరు వ్యక్తులు తనను జూన్ 2న ఓ హోటల్ కు తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ నకు పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది.
ఈ అఘాయిత్యాన్ని వీడియోలో మరో స్నేహితుడికి నిందితులు లైవ్ స్ట్రీమ్ చేశారని.. అంతేకాకుండా ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొందని వివరించారు.
నిందితులపై ఇంతకుముందు కూడా ఇలాంటి ఆరోపణలే ఉన్నాయని.. వారు పరారీలో ఉన్నట్టు గుప్తా తెలిపారు. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో చట్టం, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశామని.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న రేపిస్టుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.