కారణాలు ఏమైనా కానీ.. దశాబ్దాల తరబడి అండర్ వరల్డ్ డాన్ లుగా వెలుగొందుతూ.. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి తిరుగుతున్న కొమ్ములు తిరిగిన మొనగాళ్లు లాంటి మాఫియా డాన్లు ఇప్పుడు దొరికిపోతున్నారు. ఆ మధ్యన ఇండోనేషియాలో చోటా రాజన్ దొరికిపోవటం తెలిసిందే. అతన్ని ఇండోనేషియా నుంచి ఇండియాకు తీసుకొచ్చి అతన్ని జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా అలాంటి మరో పెద్ద డాన్ పోలీసులకు దొరికిపోయాడు. కాకుంటే మన దేశంలో కాకుండా సింగపూర్ లో . నిషేధిత ఎల్టీటీఈతో సన్నిహిత సంబంధాలు ఉన్న కుమార్ పిళ్లై గతంలో ముంబయిలోని పలు హత్యలు.. బెదిరింపులు.. దందాలకు పాల్పడ్డాడు. ఇతని కోసం పోలీసులు గత కొన్నేళ్లుగా తీవ్రంగా గాలిస్తున్నారు. అలాంటి కుమార్ పిళ్లై తాజాగా సింగపూర్ పోలీసుల చేతికి చిక్కినట్లుగా చెబుతున్నారు. అయితే.. సింగపూర్ పోలీసులకు చిక్కిన వ్యక్తి కుమార్ పిళ్లైయేనా? కాదా? అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవటానికి ముంబయి పోలీసులు ట్రై చేస్తున్నారు. ఒకవేళ దొరికింది అతనే అయితే.. మరో పెద్ద డాన్ దొరికిపోయినట్లే.