టీడీపీ మీటింగుకి గంటా - కేశినేని దూరం..జంపింగుకేనా...!

Update: 2019-08-13 13:58 GMT
ఇటీవల ఎన్నికల ఓటమి దగ్గర నుంచి టీడీపీకి గట్టి షాకులే తగులుతున్నాయి. ఓటమి తర్వాత చాలామంది నేతలు సైలెంట్ అయిపోవడం, కొందరు బీజేపీలోకి వెళ్లిపోవడం, మరికొందరు సొంత పార్టీనే టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం జరుగుతుంది. అలాగే మరికొందరు త్వరలోనే టీడీపీని వీడి బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. అలాంటి తరుణంలోనే విజయవాడ లో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి కొందరు ముఖ్య నేతలు హాజరు కాలేదు. అందులో కొందరు అనారోగ్య సమస్యల వల్ల సమావేశానికి దూరంగా ఉన్నారు.

కానీ ఇద్దరు నేతలు మాత్రం కావాలనే సమావేశానికి రాలేదని తెలుస్తోంది. అందులో ఒకరు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కాగా, మరొకరు ఎంపీ కేశినేని నాని. గత కొన్ని రోజులుగా వీరు పార్టీ మారుతారనే ప్రచారం ఉంది. ముఖ్యంగా రెండో సారి ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి కేశినేని నాని సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ వస్తున్నారు. అధినేత ఇచ్చిన పదవిని కాదన్నారు. బుద్దా వెంకన్న, దేవినేని ఉమా లాంటి వారి మీద డైరెక్ట్ గానే కామెంట్లు చేశారు. త్వరలో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని అందుకే అలా మాట్లాడుతున్నారని ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రచారాన్ని కేశినేని ఖండించారు.

నాని ఈ ప్ర‌చారం ఖండించినా టీడీపీతో మాత్రం అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. పైగా టీడీపీ పార్టీ కార్యాలయం ఇక విజయవాడ బస్టాండ్ దగ్గర ఉన్న కేశినేని భవన్ కాదని, ఆటో నగర్ లో ఉన్న ఆఫీసులోనే ఇక పార్టీ కార్యక్రమాలు జరుగుతాయని టీడీపీ నుంచి ఓ లేఖ వచ్చింది. దీంతో కేశినేని ఇంకా హర్ట్ అయ్యి సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది. మొత్తానికి టీడీపీకి దూరంగా ఉంటున్న నాని త్వరలో వేరే పార్టీలోకి జంప్ అయ్యేలా ఉన్నార‌న్న పుకార్లు మ‌రింత జోరుగా వినిపిస్తున్నాయి. నాని త‌న‌పై పార్టీ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో ? అని వేచి చూసే ధోర‌ణితోనే పార్టీ అధిష్టానాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ఉడికించేలా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది.

ఇక గంటా శ్రీనివాసరావు..ప్రభుత్వం ఉన్నప్పుడూ కీలకంగా ఉన్న గంటా ఇప్పుడు ఓడిపోయాక సైలెంట్ అయిపోయారు. ఏదో మొక్కుబడిగా అప్పుడప్పుడు పార్టీ సమావేశాలకు హాజరైన అంత హైలైట్ కాలేదు.  చాలాసార్లు ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం కూడా జరిగింది. దాన్ని గంటా చాలాసార్లు ఖండించారు కూడా. అయిన ఆయన పార్టీలో యాక్టివ్ గా ఉండట్లేదు. ఏదో ఒక రోజు వైసీపీలోకి వెళ్ళిపోతారని పార్టీ వర్గాలు చర్చికుంటున్నాయి. అదే టైంలో గంటా బీజేపీలోకి వెళ‌తార‌న్న ప్ర‌చారం కూడా ఉంది. ఇటీవ‌ల కీల‌క‌మైన పీఏసీ ప‌ద‌వి ఆశించి భంగ‌ప‌డ‌డంతో గంటా మ‌రింత అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి తరుణంలో పార్టీ ముఖ్య సమావేశానికి గంటా హాజరుకాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చూద్దాం రానున్న రోజుల్లో ఈ ఇద్దరు నేతలు జంప్ అవుతారో లేదో ?


Tags:    

Similar News