మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఆసక్తికరంగా స్పందించారు. కొద్దిరోజులుగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ పార్టీ మారుతారనే ఊహాగానాలు ఆయనపై వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే విశాఖను పరిపాలన రాజధానిగా చేయడాన్ని గంటా స్వాగతించారు. చంద్రబాబు నిర్ణయానికి విరుద్ధంగా తన ప్రజల తరుఫున నిలబడ్డారు.
అయితే తాజాగా చంద్రబాబు అమరావతి రాజధాని పోరాటంపై కూడా గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖకు చెందిన వ్యక్తిగా తాను విశాఖలో రాజధాని పెట్టడాన్ని స్వాగతిస్తున్నానని గంటా ప్రకటించారు. అయితే రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇక అమరావతి రైతులకు మద్దతుగా నిలవాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలకు సైతం తాను కట్టుబడి ఉంటానని గంటా శ్రీనివాస్ తెలిపారు. తాను పార్టీ మారుతున్నాన్నది ఊహాగానాలేనని.. పార్టీ మారే ఉద్దేశం లేదని.. టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు.
ఇలా సీనియర్ నేత గంటా ఊగిసలాటకు చెక్ పడింది.. విశాఖపై ప్రేమ.. జవదాటని బాబు మాటను నిలుపుకుంటూ రెండు పడవల ప్రయాణం చేస్తూ గంటా నొప్పింపక తానొవ్వక అన్న రీతిలో తప్పించుకునే సమాధానం ఇవ్వడం విశేషం.