గ‌వ‌ర్న‌ర్‌పై గంటా హాట్ కామెంట్స్

Update: 2015-06-27 16:52 GMT
ఉమ్మ‌డి రాష్ర్టాల గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ తీరుపై ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రంగా అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. సెక్ష‌న్ 8 లేకున్నా తాను స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కృషిచేస్తున్నాన‌ని గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్యానించిన నేప‌థ్యంలో గంటా ఘాటుగా స్పందించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభజన త‌ర్వాత ప్ర‌స్తుత ఆంధ్ర‌ప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల మ‌ధ్య నెల‌కొన్న సమస్యలు  పరిష్క‌రించాల‌ని కోరుతూ తానొక్క‌డినే ఇప్పటికి 23 సార్లు గవర్నర్‌ను కలిశానని గంటా విలేక‌రుల స‌మావేశంలో తెలిపారు. అయినా ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మ‌డి ఎంసెట్ నిర్వ‌హ‌ణ విష‌యంలో తెలంగాణ‌ ప్ర‌భుత్వం తీరుపై స్పందించాల‌ని, ఉన్న‌త విద్యామండ‌లి విభ‌జ‌న త‌దిత‌ర అంశాల్లో తెలంగాణ స‌ర్కారు వ్య‌వ‌హార‌శైలి బాగాలేద‌ని, ఇంకా అనేక కీల‌క అంశాల్లోనూ కేసీఆర్ స‌ర్కారు గ‌వ‌ర్న‌ర్ త‌గిన ఆదేశాలు ఇవ్వాల‌ని కోరినా త‌గు నిర్ణ‌యం వెలువ‌డ లేద‌న్నారు.

ఇంట‌ర్ విద్యార్థుల రికార్డులు అప్ప‌గిస్తామ‌ని చెప్పిన తెలంగాణ అధికారులు ఇప్ప‌టికీ త‌గిన చ‌ర్య‌లు తీసుకోకున్నా స్పంద‌న లేద‌ని, అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ అడ్మిష‌న్ల ఫ‌లితాల విడుద‌ల‌లో తెలంగాణ విద్యార్థుల‌వే విడుద‌ల చేసి....ఆంధ్ర‌ప్ర‌దేశ్ వారిని హోల్డ్‌లో ఉంచినా గ‌వ‌ర్న‌ర్ నుంచి స్పంద‌న లేద‌న్నారు.  ఈ ర‌కంగా తెలంగాణ ప్రభుత్వం  లక్షలాదిమంది విద్యార్థులతో ఆటలాడుకున్న స్పంద‌న లేద‌ని అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

రాష్ర్ట విభ‌జ‌న చ‌ట్టాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం గౌర‌వించ‌డం లేద‌ని, తెలంగాణ‌, హైద‌రాబాద్ అంటే ప్ర‌త్యేక రాజ్యం అన్న రీతిలో ఆ రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. విభ‌జ‌న చ‌ట్టం అటే తెలంగాణ ప్రభుత్వానికి ఇసుమంతైనా గౌరవంలేదని విమర్శించారు. విభజన చట్టంపై  వితండవాదం చేస్తోందని. శత్రుదేశం కూడా ఇలా చేయదని గంటా వ్యాఖ్యానించారు. సెక్షన్-8 కూడా అమలు చేయకుంటే హైదరాబాద్‌ను యూటీ చేయాల్సిన పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు.
Tags:    

Similar News