ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి - విశాఖపట్నం ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీని వీడబోతున్నారా..? పార్టీ మారేందుకు ఇప్పటికే మంతనాలు కూడా జరిపారా..? కొందరు నేతల విషయంలో పార్టీ అనుసరిస్తున్న వైఖరి పట్ల ఆయన సీరియస్ గా ఉన్నారా..? టీడీపీకి గుడ్ బై చెప్పి మరో పార్టీలో చేరడానికి ఆయన సన్నాహాలు మొదలుపెట్టారా..? అంటే దాదాపుగా అవుననే సమాధానం వినిపిస్తోంది. అవును.. గంటా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని ఓ వార్త రాజకీయ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చాలా మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతారని అనుకున్నారు. అయితే - రాష్ట్ర ముఖ్యమంత్రి - ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం వలసలను ప్రోత్సహించడం లేదు. ఎమ్మెల్యేలు ఎవరైనా తమ పార్టీలోకి రావాలనుకుంటే పదవికి రాజీనామా చేయాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. దీంతో టీడీపీ నుంచి వలసలు ఆగిపోయాయి. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ.. చాలా మందితో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఇప్పటికే ప్రభావం చూపిన ఆ పార్టీ.. ఏపీలోనూ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీకి చెందిన కొందరు నేతలు గంటా శ్రీనివాసరావుతో చర్చలు జరిపారని తెలుస్తోంది. తమ పార్టీలో చేరితే తగిన గుర్తింపు ఇస్తామని బీజేపీ అధిష్ఠానం ఆయనకు హామీ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే గంటా.. కమలం గూటికి చేరాలని నిర్ణయించుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన మాత్రమే కాదట.. గంటాతో పాటు పలువురు నేతలు కూడా ఇదే బాటలో నడుస్తారని ప్రచారం జరుగుతోంది.
ఈ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కౌంటింగ్ రోజు ఆయన గెలుపుపై ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపులో ఆఖరి రౌండ్‌లో కొన్ని ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఫలితాన్ని ప్రకటించకుండా నిలిపివేసిన విషయం తెలిసిందే. తర్వాతి రోజు ఉదయం దీనిపై ఎన్నికల సంఘం అధికారులతో చర్చించి - వారి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మధ్యాహ్నం గంటా శ్రీనివాసరావు 1,944 మెజారిటీతో తన సమీప వైసీపీ అభ్యర్థి కె.కె.రాజుపై విజయం సాధించారని ఇక్కడి అధికారులు వెల్లడించారు.