గ్యాస్ 225.. పెట్రోల్ 100 పెంపు ఎఫెక్ట్ 5 రాష్ట్రాల్లో ముంచుతుందా?

Update: 2021-03-05 09:55 GMT
దేశంలో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంకా ఆర్థికంగా దేశం కుదటపడలేదు. ప్రభుత్వాలకు, ప్రజలకూ ఆదాయాలు పెరగడం లేదు.  ఉద్యోగాలు పూర్తి స్థాయిలో పునరుద్ధరించడం లేదు. కొత్త ఉద్యోగాలు రావడం లేదు. విదేశాల నుంచి నిధులు పెట్టుబడులు కూడా పెద్దగా రావడం లేదు.

రియల్ ఎస్టేట్ రంగం పెద్దగా కోలుకోవడం లేదు. బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించినా కూడా నిర్మాణ రంగం పుంజుకోవడం లేదు. కరోనా తగ్గుతున్నట్టే తగ్గి మళ్లీ రెండో వేవ్.. మూడో వేవ్ అంటూ వస్తూనే ఉంది. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలకు భారం తగ్గించి డబ్బులు మిగిలేలా చేయాల్సిన ప్రభుత్వాలు ఏమాత్రం కనికరించడం లేదన్న ఆవేదన సామాన్యుల్లో ఉంది.

కేంద్రంలోని మోడీ మాత్రం పేద ప్రజల మీద భారం రోజురోజుకు పెంచుతూనే ఉన్నాడు. గ్యాస్ మీద 225, పెట్రోల్ 100 రూపాయల వరకు పెంచారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటున్నాయి.. ఇంత ధరఘాతంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా కానీ మోడీకే ఓట్లు వేయాలని బీజేపీ చెప్తోంది. ఎందుకంటే ఏదో కథలు చెప్తారు.. చర్చల్లో కరెక్ట్ గా సమాధానం చెప్పరు.

ఖచ్చితంగా ఈ ధరల పెరుగుదల రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఈ ఎఫెక్ట్ ఉంటుందని మేధావులు అంటున్నారు. చుక్కల నంటిన ధరలు.. ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యులకు శరాఘాతంగా మారిందని.. సంపాదన లేని వేళ పట్టించుకోని బీజేపీ ప్రభుత్వం పై ప్రజలంతా కసితీర్చుకోవడానికి ఎదురుచూస్తున్నారని చెబుతున్నారు. మరి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వస్తుందనేది వేచిచూడాలి.
Tags:    

Similar News