అత్యంత విలువైన ఐపీఎల్ జట్టులోకి గౌతమ్ గంభీర్

Update: 2021-12-18 23:30 GMT
ఐపీఎల్ 2022 కోసం భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రెడీ అవుతున్నాడు. కొత్త బాధ్యతను స్వీకరించాడు. లక్నో ఫ్రాంచైజీ అతడిని జట్టుకు మెంటార్ గా చేసింది. గంభీర్ కెప్టెన్ గా రెండు సార్లు కేకేఆర్ ను ఛాంపియన్ గా నిలిపాడు. తాజాగా లక్నో ఫ్రాంచైజీ యజమాని ఆర్పీ సంజీవ్ గోయెంకా కూడా గంభీర్ కు సాదర స్వాగతం పలికాడు.

ఐపీఎల్ టైటిల్ ను రెండు సార్లు గెలిచిన గౌతం గంభీర్ క్రికెట్ నుంచి రిటైర్ మెంట్ అయ్యి ఇప్పటికే మూడేళ్లు దాటింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి చేరి బీజేపీ తరుఫున ఢిల్లీ నుంచి ఎంపీగా గెలిచాడు. ప్రజాసేవలో బిజీగా ఉన్నాడు.

ఈ కేకేఆర్ మాజీ కెప్టెన్ తిరిగి ఐపీఎల్ లో అడుగుపెడుతున్నాడు.2018 డిసెంబర్ 3న రిటైర్మెంట్ ప్రకటించిన గంభీర్.. తాజాగా తిరిగి ఐపీఎల్ లో భాగస్వామ్యం అవుతున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. డిసెంబర్ 18న తన రీఎంట్రీ గురించి వివరిస్తూ ట్విట్టర్ లో పోస్టు పెట్టాడు.

అయితే ఈసారి క్రికెటర్ గా కాకుండా మెంటార్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఐపీఎల్ 2022 నుంచి రెండు కొత్త జట్లు లీగ్ లో అరంగేట్రం చేయబోతున్నాయి. వీటిలో లక్నో జట్టును దక్కించుకున్న ఆర్పీఎస్జీ గ్రూప్ గౌతమ్ గంభీర్ ను తమ జట్టు మెంటార్ గా నియమించుకున్నది.

గౌతం గంభీర్ కెప్టెన్సీలో రెండు సార్లు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును చాంపియన్ గా నిలిపాడు. ఆ తర్వాత ఆ జట్టు ఎప్పుడూ టైటిల్ గెలవలేకపోయింది. మరోవైపు గంభీర్ 2 ప్రపంచకప్ టైటిళ్లను కూడా గెలుచుకున్నాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో కీలక ఓపెనర్. రెండు ఫైనల్స్ లోనూ అద్భుతంగా ఆడాడు. ఇప్పుడు లక్నో జట్టుకు మెంటార్ గా కీలక బాధ్యతల్లోకి అడుగుపెట్టాడు.

లక్నో ఫ్రాంచైజీ జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్ ను ప్రధాన కోచ్ గా నియమించింది. అంతకు ముందు పంజాబ్ కింగ్స్ కు అతడు అసిస్టెంట్ కోచ్ గా పనిచేశాడు.
Tags:    

Similar News