అఫ్రిది వ్యాఖ్యలపై భారత క్రికెటర్ల ఫైర్.. అదుపులో ఉండాలని హెచ్చరిక
జమ్మూ కశ్మీర్ అంశంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దూషిస్తూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కరోనాకు మించిన వ్యాధి మోదీలో ఉందని, కశ్మీర్‌లో భారత్ సైనికులను మోహరించిందని చెబుతూనే విద్వేషకరంగా మాట్లాడాడు. దీనిపై భారత్‌లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అఫ్రిది వ్యాఖ్యలపై భారత క్రికెటర్లు ఘాటుగా స్పందిస్తున్నారు. అఫ్రిద్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూనే గట్టి కౌంటర్ ఇస్తున్నారు. భారత క్రికెట్ మాజీ క్రీడాకారుడు, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, ప్రస్తుత ఓపెనర్ శిఖర్ ధావన్ తదితరులు అఫ్రిది చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు.
ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో అఫ్రిది పర్యటించి కరోనా బాధితులకు తన స్వచ్చంద సంస్థ ద్వారా సహాయం అందించాడు. ఈ సందర్భంగా భారత్‌పై విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో భారత ప్రజలతో పాటు క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు స్పందిస్తున్నారు. అఫ్రిది, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, బాజ్వాలాంటి జోకర్లు భారత్‌కు, మోదీకి వ్యతిరేకంగా విషం చిమ్ముతున్నారని గంభీర్ ట్విటర్‌లో మండిపడ్డారు. పాకిస్థాన్‌కు 7 లక్షల సైన్యం, 20 కోట్ల జనాభా ఉందని అఫ్రిది 16 ఏళ్ల పిల్లాడిలా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశాడు. ఆ దేశం 70 ఏళ్లుగా కశ్మీర్ కోసం బిచ్చమెత్తుకుంటోందని తెలిపారు. కానీ జడ్జ్‌మెంట్ డే వరకూ కశ్మీర్ పాక్‌కు దక్కదు. బంగ్లాదేశ్ గుర్తుంది కదా.. అని గంభీర్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
ఈ వ్యాఖ్యలపై యువరాజ్ సింగ్ ట్విటర్‌లో స్పందించాడు. ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అఫ్రిది చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా బాధించాయి. బాధ్యాతాయుతమైన భారతీయుడిగా.. దేశం తరఫున ఆడిన ఆటగాడిగా అఫ్రిది.. ఇలాంటి వ్యాఖ్యలు ఏమాత్రం అంగీకరించను. మానవత్వం కోసం నీవు అడగ్గానే నా వంతు సాయం చేశా. కానీ మరోసారి చేయను.. అని యువరాజ్ ట్విట్టర్‌లో స్పష్టం చేశాడు.
భారత శక్తిని చెబుతూనే అఫ్రిదికి బుద్ధి వచ్చేలా శిఖర్ ధావన్ ఘాటుగా స్పందించాడు. ‘ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతున్న ఈ సమయంలో కూడా కశ్మీర్ సమస్యను లేవనెత్తినందుకు సిగ్గుండాలి. కశ్మీర్ ఒకప్పుడు మాదే. ఇప్పుడూ మాదే. భవిష్యత్తులోనూ మాదే. 22 కోట్ల మంది సైన్యాన్ని తీసుకొచ్చినా సరే. మా వాళ్లు ఒక్కొక్కరు లక్షమంది సైన్యంతో సమానం. మిగతా లెక్కలు మీరే చేసుకోండి.. అని తీవ్ర ఆవేశంతో ధావన్ ట్వీట్ చేశాడు.
ఇక మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ఓ మీడియాతో మాట్లాడుతూ అఫ్రిది వ్యాఖ్యలను కొట్టిపారేశాడు. ‘మా దేశం గురించి, ప్రధాని గురించి అఫ్రిది చేసిన వ్యాఖ్యలు బాధించాయి. అతని కామెంట్స్ ను తీవ్రంగా ఖండిస్తున్నా. అవి ఏమాత్రం ఆహ్వానించదగినవు కావు. అతను మా సహాయం కోరినప్పుడు మేము ఏదీ ఆలోచించకుండా ముందుకు వచ్చాం. మానవత్వంతో స్పందించాం. కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేయాలని అలా చేశాం. మా ప్రధాని కూడా కరోనా వైరస్‌కి దేశం, కులం, మతం ఏదీ లేదని చెప్పారు. కాబట్టి మేం సంక్షోభాన్ని అధిగమించేందుకే అఫ్రిదికి సాయంగా నిలిచాం. కానీ అఫ్రిది మా దేశం గురించి మాట్లాడుతున్నాడు. ఇక అతడితో మాకెలాంటి సంబంధం లేదు. మా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు అతనికి ఏ మాత్రం లేదు. అతను తన హద్దుల్లో తన దేశంలో ఉంటే బాగుంటుంది' అని మండిపడ్డారు.
గతంలో అఫ్రిది స్థాపించిన ఫౌండేషన్‌కు విరాళాలు ఇవ్వాలని హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ భారత అభిమానులను కోరిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి పశ్చాత్తాపం పడుతున్నట్లు చెప్పారు.