రాజకీయాల్లోకి రాకముందే తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండేవాడు భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. ఇక అతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టాక రోజుకో వివాదం అతడిని వెంటాడుతోంది. ఢిల్లీలో ఎంపీగా పోటీ చేస్తున్న అతను తాజాగా ఒక కాంట్రవర్శీలో చిక్కుకున్నాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గంభీర్ కారు లోపల కూర్చుని.. పైన తన పోలికలతో ఉన్న వేరే వ్యక్తిని నిలబెట్టి అతడితో ప్రచారం చేయించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
దిల్లీలో ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రచారం చేయడం అభ్యర్థులకు చాలా కష్టమవుతోంది. దీంతో గంభీర్ తెలివిగా తన డూప్‌ను రంగంలోకి దించాడంటున్నారు. గంభీర్ లాగే డూప్ కూడా తెల్ల దుస్తులు ధరించాడు. నెత్తిన నల్ల టోపీ పెట్టుకున్నారు. అభ్యర్థి తానే అనిపించేలా మెడలో దండలు వేసుకున్నాడు. ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లాడు. ఆయనకు చుట్టూరా ఉన్న బీజేపీ నాయకులు కూడా ఆయనే అభ్యర్థి అన్నట్లుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. వాహనం చుట్టూ ఉన్నది భాజపా కార్యకర్తలే కావడంతో కారు మీద ఉన్నది గంభీరా కాదా దగ్గరగా చూసి ఎవరూ గుర్తుపట్టరన్న ఆలోచనతో ఇలా చేసినట్లున్నారు.
ఐతే గంభీర్ లోపలున్న విషయాన్ని పసిగట్టిన ఓ వ్యక్తి ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అసలు సంగతి బయటపడింది. గంభీర్‌కు డూప్‌గా వ్యవహరించిన వ్యక్తి పేరు గౌరవ్ అని.. అతను గంభీర్‌కు మిత్రుడే అని వెల్లడైంది. దీనిపై గంభీర్‌ను మీడియా సంప్రదించే ప్రయత్నం చేయగా.. అతను స్పందించలేదు. ఐతే భాజపా నాయకులు మాత్రం గంభీర్ ఉద్దేశపూర్వకంగా ఇలా చేయలేదని.. ఆ రోజున ఎండ వేడికి గౌతమ్ గంభీర్‌కు కళ్లు తిరిగాయని, ఆయన 10 - 15 నిమిషాలు తన కారులో విశ్రాంతి తీసుకున్నారని.. దీన్ని వివాదం చేయొద్దని అంటున్నారు.