మోసానికే మోసగాడు... చీటింగ్ కింగ్!

Update: 2015-08-01 04:32 GMT
ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే! మోసానికే మైకం తెప్పించ గలడు, చీటింగ్ కే చిరాకు రప్పించగలడు! చీటింగ్ కి ఫ్యాంటూ చొక్కా.. కాదు కాదు లాల్చీ పైజామా వేస్తే అది ఈ మహానుబావుడే! ఇతగాడి చీటింగ్ విద్యకు ఈమాత్రం ఇంట్రడక్షన్ సరిపోదు కానీ... విషయానికి వస్తే... ఈ ఫోటోలో కనిపిస్తున్న దొర పేరు గౌతం కుందూ.. ఉండేది కోల్ కతా! ఇప్పుడు ఇతడి కథ తెలుసుకుందాం...

కోల్ కతా లో గత కొన్ని సంవత్సరాల క్రితం రోజ్ వ్యాలీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పెట్టి, దానికి తానే చైర్మన్ అని ప్రకటించుకుని, అక్కడి నుండి చిట్ ఫండ్ కంపెనీ పెట్టి... అవే రోజ్ ఫ్లవర్స్ క్లయింట్స్ చెవిలో పెట్టాడు! అందరూ చెప్పినట్లే... నమ్మకమైన చిట్‌‌‌‌ఫండ్ కంపెనీ చిట్లు చెల్లిస్తామని నమ్మబలికి క్లయింట్ల నుంచి సుమారు 5,400 కోట్ల రూపాయల భారీ మొత్తం సేకరించగలిగాడు! అనంతరం వాటిలో కేవలం 900 కోట్లు మాత్రమే చెల్లించి.. మిగిలింది నొక్కేసాడు! దీంతో ఇతగాడి అసలు స్వరూపం బయటపడింది.

దీంతో మొదటి నుండీ తవ్వడం మొదలు పెట్టిన ఈడీకి ఇతడి ఆస్తులు చూసి షాక్ తగిలిందట! మరో విషయం ఏమిటంటే... ఇతడి పేరున ఉన్న ఆస్తులన్నీ మోసం చేసి సంపాదించినవేనట! ఇతడి చీటింగ్ రాజ్యం ఒక్క కోల్ కతాకే పరిమితం కాలేదు! దేశంలోని సుమారు 12 రాష్ట్రాల్లో ఇతడి ఆస్తులు విస్తరించి ఉన్నాయట! వాటి లెక్కలు ఒకసారి చూస్తే... ఇతడి పేరున ఉన్న భూమి మొత్తం అక్షరాలా 700 ఎకరాలు! ఇక ఇతడికి ఉన్న బ్యాంక్ అకౌట్లు 900 బ్రాంచిలలో 3,078! రాంచీలో 6000 చదరపు అడుగుల వైశాల్యంలో ఒక విల్లా! 23 హోటళ్లు, బంగారం దుకాణాలు, వజ్రాలమ్మే షాపింగ్ మాల్స్ ... ఇలా చెప్పుకుంటూ పోతే ఇతగాడు చీటింగ్ చక్రవర్తి అని ఒక్క మాటలో చెప్పొచ్చు... ఫ్రాడ్ కే పర్యాయపదం అనొచ్చు! ఇతడి ఆస్తులపై ఈడీ చార్జ్ షీట్స్ దాఖలు చేసింది!

Tags:    

Similar News