తెలంగాణ అంతా ఒక ఎత్తు.. రాజధాని హైదరాబాద్ ఒక ఎత్తుగా ఉంది. ఈ మహానగరంలో కరోనా కేసులు జెట్ స్పీడుగా నమోదవుతున్నాయి. తాజాగా రోజుకు 1000 కేసులకు దగ్గరగా వచ్చాయి. ఒక్క హైదరాబాద్ లోనే కరోనా తీవ్రంగా ప్రబలుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో రోజూ వందలకొద్దీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
ఇక హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ప్రస్తుతం పాకుతోంది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోకి సాధారణ ప్రజలకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపింది. ఫిర్యాదులు, విజ్ఞప్తులకు రావద్దంటూ హైదరాబాద్ ప్రజలకు జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది.
ఇక నుంచి అన్నీ ఆన్ లైన్ లోనే సేవలు అందుబాటులో ఉంటాయని.. పనిదినాల్లోరోజుకు 500 నుంచి 700 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తారని జీహెచ్ఎంసీ తెలిపింది. ఇప్పటికే జీహెచ్ఎంసీలో 25మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. పారిశుధ్య కార్మికులతోపాటు ఉన్నతాధికారులకు కరోనా సోకింది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీలోకి సాధారణ ప్రజలకు అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో తాజాగా 872 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే ఏడుగురు కరోనాతో మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య 8674కు చేరింది.