ఎగిరిప‌డ్డ జెయింట్ వీల్..ప‌దేళ్ల బాలిక మృతి!

Update: 2018-05-28 09:32 GMT
అనంతపురంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్ ఏర్పాటైన ఓ ఎగ్జిబిషన్ లో ఆదివారం రాత్రి ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఆ ఎగ్జిబిష‌న్ లో ఏర్పాటు చేసిన జెయింట్ వీల్ లోని ట్రాలీ కార్ ఊడి ప‌డ‌డంతో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 10 ఏళ్ల చిన్నారి అమృత అక్కడికక్కడే మృతి చెందింది. ముగ్గురు చిన్నారుల స‌హా మ‌రో ఆరుగురు గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను అనంతపురం జనరల్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. జెయింట్ వీల్ ఆపరేటర్ నిర్ల‌క్ష్యం కార‌ణంగానే  ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని జిల్లా యంత్రాంగం....అధికారుల‌ను, పోలీసుల‌ను ఆదేశించింది.

ఆదివారం సెల‌వు దినం కావ‌డంతో స్థానికి జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కు స్థానికులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. వేస‌వి సెల‌వులు కూడా కావ‌డంతో పిల్ల‌లు పెద్ద‌సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. అక్కడ ఏర్పాటు చేసిన జెయింట్ వీల్ తిరుగుతున్న సమ‌యంలో ఓ ట్రాలీ కార్ బోల్టు లూజ్ గా ఉంది. ఈ విషయం ట్రాలీ ఆప‌రేట‌ర్ కు చెప్పినా అత‌డు పెడ చెవిన పెట్ట‌డంతో ఆ ట్రాలీ కార్ ఊడి కింద ప‌డింది. అంతేకాకుండా, అది  కిందపడుతూ మరో రెండు ట్రాలీ కార్ లను ఢీకొట్టింది. దీంతో, ప‌దేళ్ల చిన్నారి అమృత అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా, మ‌రో ఆరుగురు గాయ‌ప‌డ్డారు. గాయపడిన వారిని అనంతపురం జనరల్ హాస్పిటల్ కు తరలించారు. జెయింట్ వీల్ ఆపరేటర్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఈ ఘటన జ‌రిగింద‌ని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అంతేకాకుండా, జెయింట్ వీల్ తిరుగుతున్న సమయంలో ఆపరేటర్ మద్యం మత్తులో ఉన్నాడని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘ‌ట‌న జరిగిన అనంత‌రం ఆ ఆప‌రేట‌ర్ కు స్థానికులు దేహ‌శుద్ధి చేసి పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News