ఉన్నది లేనట్లు అనిపించడం, లేనిది ఉన్నట్లు అనిపించడం.. ఇదంతా భ్రమకు సంకేతం. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి భ్రమలకు చిరునామా. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి రాష్ట్రాల్లో నాయకుల వరకు అందరిదీ ఇదే పరిస్థితి. ఒకరు మీటింగు పెడితే ఇంకొకరు రారు.. సీనియర్లు ఉన్న చోటికి జూనియర్లు రారు.. జూనియర్లను పిలిచారని సీనియర్లు రారు.. అంత జరుగుతున్నా పార్టీలో విభేదాలు లేవంటారు.. అదో భ్రమ.
ఈసారితో మోదీ పనైపోయింది.. బీజేపీని జనం వ్యతిరేకిస్తున్నారు అంటూ ప్రతి ఎన్నికల ముందూ కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉంటుంది.. ఎన్నికల ఫలితాలలో వెనకబడుతూనే ఉంటుంది.. ఇదీ భ్రమే.
ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి భ్రమ ఒకటి ఉంది. అది చిరంజీవి ఇంకా తమ పార్టీలో ఉన్నారనుకోవడం. ఆయన పార్టీకి రాజీనామా చేయకపోయినంత మాత్రాన కాంగ్రెస్‌లోనే ఉన్నారనుకుంటుంటారు ఆ పార్టీ నాయకులు. తాజాగా ఏపీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కూడా అదే మాట చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నారని, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని కూడా రుద్రరాజు చెప్పారు.
ఒంగోలులో విలేకరులతో మాట్లాడిన ఆయన చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్న విషయం చెప్పారు. సోనియా, రాహుల్ గాంధీలతో టచ్‌లో ఉన్నారనీ చెప్పారు. అయితే.. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి ప్రారంభించిన భారత్ జోడో యాత్ర దాదాపు ముగిసిపోతున్నా.. ఏపీ, తెలంగాణల మీదుగా వెళ్లినా.. చిరంజీవి నివసించే హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ వచ్చినా కూడా చిరంజీవి అటువైపు కన్నెత్తి కూడా ఎందుకు చూడలేదో మాత్రం ఆయన చెప్పలేదు. అంతేకాదు.. పూనమ్ కపూర్, పూజా భట్, కమల్ హాసన్ వంటి కొత్తాపాతా, చిన్నాపెద్దా సినీనటులు కూడా రాహుల్ గాంధీని భారత్ జోడోయాత్రలో కలిసి ఆయనతో అడుగులు వేసినా చిరంజీవి ఎందుకు వెళ్లలేదో చెప్పలేదు.
అంతేకాదు... సినిమా టికెట్ల వ్యవహారంలో చిరంజీవి ఏపీ సీఎం జగన్‌ను కలిసినప్పుడు.. తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కి సంబంధించిన రాజకీయ విషయాలపై మాట్లాడినప్పుడు చిరంజీవి కాంగ్రెస్ నేత హోదాలోనే ఉన్నారో లేదో కూడా గిడుగు చెప్పలేదు.
అంతేకాదు... కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటున్న చిరంజీవి ఇటీవల కాలంలో పార్టీ సమావేశాలకు ఎందుకు రావడం లేదు, పార్టీకి ఆయనకు మధ్య కమ్యూనికేషన్ ఉందా అనేదీ చెప్పలేదు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే అసెంబ్లీ, లోక్‌సభకు పోటీ చేస్తుందని.. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని అన్నారు.. ఎన్నికల కోసం జిల్లా కమిటీలు, నాయకులను సిద్ధం చేసేందుకు జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పిన గిడుగు వీటన్నిటిలో కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి పాత్రేమిటి, ఆయన ఇన్వాల్వ్‌మెంట్ ఎలా ఉండనుందో కూడా చెప్పలేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.