పేదరికంతో ఆన్ లైన్ క్లాస్ లకు నెట్ - టీవీ లేక విద్యార్థి ఆత్మహత్య
మహమ్మారి వైరస్ విజృంభణతో విద్యాలయాలన్నీ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు పాఠాలు మరచిపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌తో కేరళ ప్రభుత్వం కూడా ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తోంది. అయితే వాటిని కేవలం సంపన్నులు, మధ్య తరగతి ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. కానీ చాలా మంది పేద విద్యార్థులు ఆ తరగతులను వినలేకపోతున్నారు. దానికి కారణంగా వారింట్లో నెట్, టీవీ లేకపోవడమే. ఇదే బాధతో ఓ విద్యార్థిని కేరళలో ఆత్మహత్య చేసుకున్నది. పేదరికంతో చదువుకు దూరమవడంతో ఆ బాలిక మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడింది.
కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 9 తరగతి విద్యార్థినికి కూడా టీవీ సదుపాయం లేదు. వాళ్ల ఇంట్లో టీవీ ఉన్నా మరమ్మతుకు నోచుకుంది. దాన్ని రిపేర్ చేయించే స్థోమత కూడా లేదు. దానిని బాగు చేయించాలని కుటుంబసభ్యులను కోరినా ఫలితం లేదు. టీవీ రిపేర్ చేయించలేకపోవడంతో తండ్రి పక్కింట్లో వెళ్లి చూడు అని సలహా ఇచ్చాడు. అయితే ఆన్‌లైన్ తరగతులు వినేందుకు టీవీ బాగు చేయించాలని కోరినా అంత స్థోమత లేకపోవడంతో తండ్రి చేయించలేదు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం కావడంతో లాక్‌డౌన్ వలన ఉపాధి కోల్పోయి చేతిలో డబ్బు లేదు. తినడానికే కష్టంగా ఉన్న సమయంలో టీవీ బాగు చేయించే పరిస్థితి లేదు. టీవీ రిపేర్ చేయకపోవడంతో తాను ఆన్‌లైన్ క్లాసులు వినలేకపోతున్నానని బాలిక బాధపడుతుండేది. ఈ క్రమంలోనే తాను విద్యాపరంగా వెనకపడతానని భావించి మనస్తాపానికి లోనైంది. దీంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. ఈ ఘటనపై కేరళ విద్యాశాఖ మంత్రి రవీంద్రనాథ్ స్పందించి పూర్తి వివరాలు సేకరించి నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశించారు.