ఒక్కసారి పాముకాటేస్తే.. ప్రాణాలు పోయినట్లే. అలాంటిది ఒక యువతికి 34 సార్లు పాము కాటేసినా ఏమీ కాని వైనం ఇప్పుడుఅందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ34 పాముకాట్లలో శ్వేతనాగు మూడుసార్లు కాటేసినట్లుగా చెబుతున్నారు. ఈ విచిత్ర సంఘటన హిమాచల్ ప్రదేశ్ లోని శ్రీమౌర్ కు చెందిన మనీషాకు ఎదురైంది. ఇప్పుడామె ఉదంతం అందరికి ఆసక్తికరంగా మారింది.
తన కుమార్తెకు పాములు కాటేయటం మామూలు విషయంగా మారిందని ఆమె తల్లిదండ్రులు పేర్కొనటం మరో విశేషంగా చెప్పాలి. ఇదిలా ఉంటే.. పాములు తనను కాటేసే విషయంలో మనీషా చెప్పే మాటలు వింటే కాస్తంత షాకింగ్ గా ఉంటుంది. ఇన్నిసార్లు పాములు కాటువేయటాన్ని ఆమె అస్సలు భయపడటం లేదు సరి కదా.. ‘‘మూడేళ్లలో 30కి పైగా పాములు కాటేశాయి. తాజాగా ఒక తెల్లని పాము కాటేసింది. నాకు ఎప్పుడు పాము కనిపించినా అదోలాంటి తన్మయత్వం కలుగుతుంది. నేను తేరుకునే లోపే అవి వచ్చి.. నన్ను కాటేసి వెళ్లిపోతాయి. స్కూల్లో ఉన్నప్పుడు చాలాసార్లు పాములు వచ్చి కాటు వేసి వెళతాయి. ఒక్కోరోజులో రెండు.. మూడు పాములు కూడా వచ్చి కాటేసిన సందర్భాలు ఉన్నాయి’’ అంటూ ఆమె చెప్పే మాటలు వింటుంటే.. గొంతు తడారిపోవటం ఖాయం.
ఇదిలా ఉంటే.. ఆమె మెడికల్ రిపోర్ట్ లను చూస్తే.. ఈ నెల18న ఆమెను తాజాగా మరోసారి పాముకాటుకు గురైనట్లుగా తెలుస్తుంది. తాజా పాముకాటు తర్వాత ఆసుపత్రిలో చేర్చారు. వైఎస్ పార్మార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఇప్పుడామె కోలుకొంటోంది. పాములు కాటేయటం.. తాముఆసుపత్రికి రావటం తమకు.. తమ కూతురికి మామూలేనని మనీషా తండ్రి చెబుతున్నారు.
తనకు.. నాగదేవతకుఏదో సంబంధం ఉందని.. అందువల్లే పాముకాటుతో తనకేంకావటం లేదని జ్యోతిష్యులు.. పూజారులు చెప్పినట్లుగా మనీషా చెబుతోంది. ఇదిలా ఉంటే.. వైద్యుల వాదన వేరేలా ఉంది. ఆమెను కరిచిన పాముల్లో అత్యధికం విషం లేని పాములేనని.. అందువల్లేఆమెకు ఏమీ కాలేదని చెబుతున్నారు.
అంతేకాదు.. మనీషా శరీరంలో యాంటీ బాక్టీరియా లక్షణాలు పెరిగాయని హిమాచల్ ప్రదేశ్ అటవీ శాఖ పశువైద్యులు రోహిత్ చెబుతున్నారు. పాము కాటుకు తట్టుకునేలా గుర్రాలకు విషాన్ని ఇస్తుంటాం. అది వాటిల్లోయాంటీ బాడీస్ నుతయారు చేస్తుంది. మనీషా విషయంలోనూ అలానే జరిగి ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏమైనా.. ఇన్నిసార్లు పాము కాటేసిన తర్వాత ఏం కాకపోవటం విశేషం. అయినా.. ఒకే వ్యక్తిని అన్ని పాములు ఇన్నిసార్లు కాటేయటం ఏమిటి..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/