రోడ్డు ప్రమాదాల్లో ప్రముఖుల మరణాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. దేశంలోని రోడ్ల భద్రత మీద పలు విమర్శలు వినిపిస్తున్న వేళ.. మరో ప్రముఖుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే.. తాజా రోడ్డు ప్రమాదం దేశంలో కాక.. విదేశంలో చోటు చేసుకుంది.
అమెరికాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ప్రఖ్యాత వర్సిటీగా పేరున్న గీతం వర్సిటీ అధినేత.. ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మృతి చెంఆరు. అంకరేజ్ సిటీ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6న కాలిఫోర్నియాలో జరిగే గీతం పూర్వ విద్యార్థుల సమావేశంలో మూర్తి పాల్గొని ప్రసంగించాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో హాజరు కావటం కోసం ఆయన అమెరికాకు వచ్చారు.
స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం కాలిఫోర్నియా నుంచి అలస్కాలోని ఆంకరేజ్ సఫారీని సందర్శించేందుకు వెళుతున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మూర్తి ప్రయాణిస్తున్న వ్యాన్ ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మూర్తితో పాటు కారులో ప్రయాణిస్తున్న వెలువోలు బసవపున్నయ్య.. వీరమాచినేని శివప్రసాద్.. విబీఆర్ చౌదరిలు మృతి చెందారు ఇక.. కడియాల వెంకటరత్నం అలియాస్ గాంధీ తీవ్ర గాయాలతో అలాస్కా ఆసుపత్రిలో చేరారు . తీవ్ర గాయాలతో ఇద్దరు ఘటనాస్థలంలోనే మృతి చెందగా మరో ఇద్దరు హెలికాప్టర్ లో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు విడిచారు.
రోడ్లు ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే తానా సభ్యుల బృందం ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆంకరేజ్ సిటీ వద్ద ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు వెళుతున్న వేళ.. ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఊహించనిరీతిలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం తెలుగు వారికి షాకింగ్ గా మారింది.