ఒకవేళ పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే ఆ ఆప్షన్‌ను ఎన్నుకునే అవకాశం ఓటరుకు కల్పించిన గొప్ప అవకాశం నన్ ఆఫ్ ద ఎబోవ్.....నోటా. ఓటర్లకు ఉండే ఆప్షన్ ఎక్కువగా బీజేపీకే దెబ్బేసినట్లుంది. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటివరకు బీజేపీ అధికారంలో ఉన్న గోవా ఓటర్లే ఈ ఆప్షన్ ను ఎక్కువ శాతం వాడుకున్నారట. గోవా రాష్ట్రంలో అత్యధికంగా ఓటర్లు ఈసారి నోటా ఆప్షన్‌ను ఎన్నుకున్నట్లు ఎన్నికల సంఘం నివేదికలు వెల్లడిస్తున్నాయి.
గోవాలో 1.2 శాతం మంది ఓటర్లు నోటా మీటనొక్కారట. ఈ ఓట్లు బీజేపీ ఖాతాలో చేరితో ఆ పార్టీకి మరికొన్ని సీట్లు దక్కి ఉండేవని చెప్తున్నారు. ఇక నోటాను ఎక్కువగా ఉపయోగించుకున్న వాటిల్లో రెండవ స్థానంలో ఉత్తరాఖండ్ ఉంది. ఉత్తరాఖండ్‌లో ఒక శాతం ఓటర్లు నోటాకు ఓటేసినట్లు తెలుస్తున్నది. బీజేపీ ఘన విజయం సాధించిన ఉత్తరప్రదేశ్‌లో 0.9 శాతం ఓటర్లు నోటా ఆప్షన్‌ను వినియోగించుకున్నారు. పంజాబ్‌లో 0.7 శాతం ఓటర్లు నోటాను వాడుకున్నారు. మణిపూర్లో 0.5 శాతం ఓటర్లు నోటాకు ఓటేశారు. మరోవైపు పొరాట యోధురాలు ఇరోంషర్మిలకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/