సీఎం కేసీఆర్ పట్టుబట్టి మరీ తన కలల ఆలయంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కోట్లు ఖర్చు పెట్టి పునరుద్దరిస్తున్నాడు. ఎంత ఖర్చు అయినా సరే వెనుకడాడడం లేదు. గండ శిలలు, శిల్పులను తీసుకొచ్చి చెక్కిస్తున్నాడు. తీర్చిదిద్దుతున్నాడు. ప్రతీ మూడు నెలలకోసారి సమీక్షిస్తూ పనుల్లో వేగం పెంచుతున్నాడు.
తాజాగా యాదాద్రి ఆలయ పునర్మిర్మాణ పనుల్లో భాగంగా లక్ష్మీనరసింహ స్వామి వెలిసి ఉన్న గర్భాలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందుకోసం రూ.40 కోట్ల ఖర్చుతో 60 కిలోల బంగారం వినియోగించనున్నట్లు వెల్లడించారు.
యాదాద్రి దేవస్థానం వద్ద ఉపయోగంలో లేని బంగారంతో ధ్వజస్తంభం, ప్రధాన ఆలయ తలుపులకు బంగారు తాపడం చేయించామని.. పనులు జరుగుతున్నాయని చెప్పారు.