భారతీయులు పేదోళ్లన మాట చాలామంది నోటి నుంచి వినిపించినా.. వారి ఇళ్లల్లో పోగుపడిన బంగారాన్ని లెక్క కడితే చాలు.. అసలు విషయం ఇట్టే అర్థమైపోతుంది. పొదుపును సైతం ఖర్చుగా భావించే మన సమజాం గడిచిన కొద్దికాలంగా మారుతోంది. సంపాదించిందంతా ఖర్చు పెట్టేద్దామన్న ట్రెండ్ ఇప్పుడు నగరాల్లో నడుస్తోంది. పట్టణ ప్రాంతాల్లోకి ఇప్పుడిప్పుడు పాకుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పొదుపు అన్నంతనే గుర్తుకు వచ్చేది బంగారం. బ్యాంకుల్లో డిపాజట్ల మీద వచ్చే వడ్డీ వర్క్ వుట్ కాకపోవటం.. మిగిలిన ఏరంగంలో పెట్టుబడులు పెట్టినా.. లాభాలు రాకున్న.. నష్టాలు వచ్చే అవకాశం ఏ మాత్రం లేనిది ఏదైనా ఉందంటే అది బంగారం మాత్రమే.
అందుకే.. ఇప్పుడు బంగారానికి డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. చైనాలో అంతకంతకూ విస్తరిస్తూ.. చైనీయుల కంటికి కనుకు లేకుండా చేస్తున్న మాయదారి వైరస్ పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టే వారంతా ఇప్పుడు బంగారం మీద ఫోకస్ చేస్తున్నారు. దీంతో బంగారానికి అనూహ్యమైన డిమాండ్ నడుస్తోంది. ఇది బంగారం ధరను అంతకంతకూ పెంచేలా చేస్తోంది.
తాజాగా పదిగ్రాముల మేలిమి (99.9శాతం స్వచ్ఛత) బంగారం ధర ఏకంగా రూ.43వేలకు టచ్ చేయగా.. 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.39,800కు చేరుకుంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో క్రూడ్ తో పాటు స్టాక్స్ తదితర అప్షన్స్ ను పక్కన పెట్టేస్తున్న పలువురు బంగారం మీద పెట్టుబడులు పెట్టటానికి ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. దీంతో.. బంగారం ధర భారీగా పెరుగుతోంది. వెండి కూడా ఇదే బాటలో నడుస్తూ కేజీ రూ.49వేలకు చేరుకోవటం గమనార్హం.
పెరిగిన ధరతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ఏడాది క్రితం వరకూ పదిగ్రాములు రూ.32 వేలు మాత్రమే పలికిన బంగారం.. స్వల్ప వ్యవధిలో పదిగ్రాములకు ఏకంగా రూ.10వేలు పెరగటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో కొనకుండా ఉండలేని పరిస్థితి. అయితే.. గతంలో మాదిరి కాకుండా బంగారాన్ని కొనుగోలు చేసే వారు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితి అంతకంతకూ దిగజారితే పది గ్రాముల బంగారం ధర రూ.50వేలకు టచ్ అయినా ఆశ్చర్యం లేదంటున్నారు.
పెరిగిన బంగారం ధరలు తగ్గే అవకాశాలు తక్కువని చెబుతున్నారు. కొవిడ్ వైరస్ తగ్గుముఖం పట్టటం.. పారిశ్రామిక రంగం పాజిటివ్ గా ఉన్న వేళ.. స్టాక్స్ మీద ఫోకస్ పెరుగుతుందని.. అప్పుడు మాత్రమే బంగారం ధర తగ్గే వీలుందంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం ధర పెరగటమే కాదు.. తగ్గే అవకాశాలు తక్కువనే మాట బలంగా వినిపిస్తోంది.