సీఐఐ రిజ‌ల్ట్ఃబాబు ఇలాకాలో బంగారం ఫ్యాక్ట‌రీ

Update: 2017-01-28 09:17 GMT
విశాఖ‌లో జ‌రుగుతున్న సీఐఐ స‌మ్మిట్ సంద‌ర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు నియోజ‌క‌వ‌ర్గానికి ఊహించ‌ని బంగారం లాంటి ఆఫ‌ర్ వ‌చ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంలో బంగారం శుద్ది చేసే కర్మాగారం ఏర్పాటు కాబోతుంది. ఆస్ట్రేలియన్ ఇండియా రిసోర్స్ కంపెనీ ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేయబోతుంది. కంపెనీ సీఈఓ హనుమప్రసాద్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని స్వ‌యంగా తెలిపారు.

విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సుకు హాజరైన హనుమప్రసాద్.. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గంలో రూ.300కోట్ల కోట్లతో బంగారం కర్మాగారాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ఇది త‌మ‌కు రెండో ఒప్పంద‌మ‌ని తెలిపారు. గత ఏడాది జరిగిన సీఐఐ సదస్సులో.. కర్నూలులో రూ.300కోట్లతో బంగారం శుద్ధి ప్రాజెక్టు కోసం ప్రభుత్వంతో ఎంఓయూ కుదర్చుకున్నామని తెలిపారు. ప్ర‌భుత్వ అనుమ‌తులు, స్థ‌ల సేక‌ర‌ణ‌, ఉద్యోగుల ఎంపిక వంటివ‌న్నీ పూర్త‌య్యాయ‌ని చెప్పిన హ‌నుమ ప్ర‌సాద్ మరో రెండు నెలల్లో దానికి సంబంధించిన పనులు ప్రారంభిస్తామని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News