భారీ ఎత్తున బంగారం హైదరాబాద్ కు వచ్చిన సంచలన విషయాన్ని ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఒకటి బ్రేక్ చేసింది. సదరు మీడియా సంస్థ పేర్కొన్న వివరాలు ఆసక్తికరంగానే కాదు.. హాట్ హాట్ గా మారాయి. దేశంలో మరెక్కడా లేని విధంగా పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెలువడిన వెంటనే.. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున బంగారం అమ్మకాలు సాగినట్లుగా గుర్తించారు.
దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక కథనాన్ని సదరు మీడియా సంస్థకు చెందిన ఛానల్ బ్రేకింగ్ కథనాన్ని టెలికాస్ట్ చేసింది. నవంబరు 8న పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నవంబరు30వ తేదీ వరకూ హైదరాబాద్ లో రూ.2700 కోట్లు విలువైన బంగారు బిస్కెట్లను కొనుగోలు చేసినట్లుగా ఈడీ తన దర్యాప్తులో కనుగొన్నదన్న విషయాన్ని వెల్లడించారు.
నోట్ల రద్దు నిర్ణయాన్ని వెల్లడించిన రోజున అడ్వాన్స్ చెల్లింపులు.. ఆర్డన్ల పేరిట ఒక్క గోల్డ్ షాపులోనే 5200 మంది కస్టమర్లకు అమ్మకాలు జరిపినట్లుగా సదరు ఛానల్ పేర్కొంది. ఈ సందర్భంగా సదరు వ్యాపార సంస్థ ముసద్దిలాల్ జువెల్లర్స్ గా పేర్కొంది. కేవలం 22 రోజుల వ్యవధిలో రూ.2700కోట్ల బంగారు బిస్కెట్ల అమ్మకాలు సాగటం ఒక ఎత్తు అయితే.. నోట్ల రద్దు అనంతరం అన్ని వ్యాపారాలు పడిపోయాయన్న వార్తలకు భిన్నంగా గోల్డ్ మార్కెట్ హైదరాబాద్ లో పుంజుకున్నట్లుగా పేర్కొంది.
డిసెంబరు ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకూ హైదరాబాద్ నగరానికి 1500 కేజీల బంగారం వచ్చినట్లుగా సదరు ఛానల్ పేర్కొంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇంత భారీగా బంగారాన్ని పలు ప్రముఖ బ్యాంకుల ద్వారా హైదరాబాద్ మార్కెట్ కు వచ్చినట్లుగా ఈడీ గుర్తించినట్లుగా వెల్లడించారు. మరి.. ఇంతభారీ ఎత్తున బంగారం హైదరాబాద్ కు రావటం.. పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేసిన వారికి సంబంధించిన లెక్కలపైదృష్టి సారిస్తే మరెన్ని సంచలన అంశాలు బయటకు వస్తాయో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/