ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం

Update: 2019-11-12 08:46 GMT
మ్యూనిస్టు ప్రభుత్వాలు ఎలా ఉంటాయి.. కఠినంగా ఉంటాయి. పాశ్చాత్య, విదేశీ సంస్కృతులను వారు నిషేధిస్తారు. విచ్చలవిడి తనాన్ని వ్యతిరేకిస్తారు. దేవుడిని నమ్మరు. కేరళలో వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలను పంపిస్తారు. ఇలా  కేరళ అయినా చైనా అయితే ఇదే పద్ధతి. తమ సొంత కమ్యూనిజాన్ని ప్రజలపై రుద్దుతారు.  

అయితే తాజాగా కమ్యూనిస్టులు కూడా మారిపోతున్నారు. కేరళ సీఎం, కమ్యూనిస్టు వృద్ధ నేత పినరయి విజయన్ తాజాగా పూర్తిగా మారారు. కేరళలో విస్తరించిన ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు.

24 గంటలూ బిజి బిజీగా పనిచేస్తూ అలసి సొలసిపోయే ఐటీ ఉద్యోగులు ఇక పబ్ లలో ఎంజాయ్ చేయండని స్వయంగా కేరళ సీఎం పినరయి విజయన్ పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాస్తాంత సేద తీరే మార్గాల కోసమే కేరళలో పబ్ లను తెరుస్తున్నట్టు సీఎం విజయన్ ప్రకటించారు. ఎంతో శ్రమించే ఐటీ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు.

కమ్యూనిస్టు పాలిత కేరళలో పబ్ లపై అక్కడి సీపీఎం ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే అక్కడ ప్రబలంగా ఉన్న ఐటీ ఉద్యోగులు ఒత్తిడితో సేదతీరలేకపోతున్నారు. చాలా మంది ఉద్యోగాలు వదలడమో.. పక్క రాష్ట్రాలకు వదలడమో చేస్తున్నారట.. అందుకే కమ్యూనిస్టు ప్రభుత్వం తమ పాత చింతకాయ పచ్చడి రూల్స్ ను సవరించి కేరళలో పబ్ ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. సీఎం విజయన్ తాజాగా ఐటీ ఉద్యోగుల కోసం పబ్ లు రాష్ట్రంలో పెట్టేందుకు ప్రకటన చేశారు.
Tags:    

Similar News