గన్నవరం ఎయిర్ పోర్టుకు కొత్త కళ.. 3 దేశాలకు సర్వీసులు.. ఎప్పటి నుంచంటే

Update: 2021-05-30 07:30 GMT
ఏపీ ప్రజలకు శుభవార్త. విదేశాలకు వెళ్లాలంటే అయితే చెన్నై లేదంటే.. హైదరాబాద్ కు రావాల్సిందే. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో బోలెడన్ని ఎయిర్ పోర్టులు (విశాఖ, కాకినాడ, రాజమండ్రి, గన్నవరం, కర్నూలు, కడప, రేణిగుంట) ఉన్నప్పటికి.. శంషాబాద్ ఎయిర్ పోర్టుతో పోల్చినప్పుడు.. ఈ ఏడు ఎయిర్ పోర్టులు వెలవెల పోతాయి. కనీసం అందులో పది శాతం ఫ్లైట్లనుకూడా నడిపే పరిస్థితి కనిపించదు. అన్నింటికి మించిన ప్రస్తుతం ఏపీ రాజధానిగా ఉన్న అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విదేశాలకు వెళ్లే సర్వీసులు లేని పరిస్థితి.

గతంలో సింగపూర్ కు నేరుగా విమాన సర్వీసులు ఉండేవి. వయబులిటీ గ్యాప్ ఫండ్ విదానంలో అప్పట్లో విమాన సర్వీసులు నడిపేవారు. 98 శాతం అక్యుపెన్సీ ఉండేది. ఆ తర్వాత ఆ సర్వీసుల్ని ఉపసంహరించుకోవటంతో సింగపూర్ కు నేరుగా వెళ్లలేని పరిస్థితి. ఇలాంటివేళలో.. తాజాగా మూడు దేశాలకు నేరుగా వెళ్లేందుకు వీలుగా కొత్త సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

అన్ని అనుకున్నట్లు జరిగితే.. జూన్ ఒకటి.. రెండు తేదీల నుంచి మస్కట్.. కువైట్.. సింగపూర్ లకు అంతర్జాతీయ సర్వీసులు షురూ కానున్నాయి. ఎయిరిండియా.. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థలు.. ఈ కొత్త విమాన సర్వీసుల్ని నడిపేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను త్వరలో ప్రకటించనున్నారు. గడిచిన నెల రోజులుగా గన్నవరం విమానాశ్రయంలోని అంతర్జాతీయ టెర్మినల్ ను విస్తరిస్తున్నారు. ఈ పనులు మరో రెండురోజుల్లో పూర్తి కానున్నాయి. దీంతో.. విజయవాడ నుంచి ఒకేసారి మూడు అంతర్జాతీయ విమానాల రాకపోకలు షురూ కానుండటం విశేషం. ఇది కచ్ఛితంగా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ గా చెప్పక తప్పదు.
Tags:    

Similar News