తెలంగాణ రైతులకు శుభవార్త..

Update: 2019-06-03 10:48 GMT
రోహిణి వచ్చేసింది. ఎండలు దంచికొడుతున్నాయి.  ఖరీఫ్ కు రైతన్న సిద్ధమవుతున్నాడు. మరో పది పదిహేను రోజుల్లో వానాకాలం సీజన్ మొదలు కాబోతోంది. నైరుతి రుతుపవనాలు రాక ఆలస్యం రైతులు పొలం పనులు మొదలు పెడుతారు. ఇప్పటికే పొలాలు దున్ని రెడీగా పెట్టుకున్నారు. విత్తనాలు, ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారు.ఇలాంటి క్లిష్ట సమయంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్తను చెప్పింది. రైతు బంధు కింద ఏకంగా రూ.6900 కోట్లు రైతులకు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నిలకు ముందు కేసీఆర్ రైతుల తలరాతను మార్చే ఈ గొప్ప పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం తెలంగాణలో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా అమలు చేసింది. ఇటు కేసీఆర్, అటు మోడీ గెలిచారు. తెలంగాణలో రైతులకు గత ఏడాది వరకు ఎకరానికి రూ4వేలు పంపిణీ చేశారు. ఈ ఖరీఫ్ నుంచి కేసీఆర్ రూ.5వేలకు పెంచారు. ఖరీఫ్, రబీలకు కలిపి రైతులకు 10వేలను కేసీఆర్ సర్కారు ఇస్తుంది. ఇక మోడీ సంవత్సరానికి రూ.6వేలు మాత్రమే ఇస్తానన్నారు.

వర్షాకాలం సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు విడుదల చేసిన రైతుబంధు సాయంపై రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమల్లో ఉంది. ఈనెల 7, 8వ తేదీల్లో జడ్పీ చైర్మన్, ఎంపీపీల ఎన్నికతో ఈ కోడ్ ముగుస్తుంది. ఆ తర్వాత రోజుల్లో ఈ నిధులను రైతుల కు విడుదల చేస్తుంది ప్రభుత్వం. మొత్తంగా ఖరీఫ్ ముంగిట ఎకరానికి రైతుకు రూ.5వేల ఆర్థిక సాయం గొప్ప వరంగా రైతులు భావిస్తున్నారు.


Tags:    

Similar News