ఇప్పుడు బాల్‌ అమెజాన్‌ - గూగుల్ కోర్టులో

Update: 2019-03-05 14:20 GMT
డేటా ఫైట్‌ రెండు తెలుగు రాష్ట్రాల్ని కుదిపేస్తోంది. మా డేటాను మొత్తం మీరెలా తీసుకుంటారు అని చంద్రబాబు వాదిస్తుందే.. ఓటర్లు మ్యాన్యుపులేట్‌ చేసేందుకు ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీ ద్వారా టీడీపీయే ప్రయత్నించిందని వైసీపీ - టీఆర్‌ ఎస్‌ వాదిస్తున్నారు. ఈ గొడవతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో కొత్త వివాదం రాజుకుంది.

అయితే ఎవరు - ఏ పర్పస్‌ కోసం డేటా మొత్తాన్ని కలెక్ట్ చేశారు, అసలు దీనివెనుక ఎవరున్నారు అనే విషయాన్ని పక్కనపెడితే.. మన తెలుగు ప్రజల విలువైన డేటా ఐటీ గ్రిడ్స్‌ దగ్గర ఉందనేది కాదనలేని వాస్తవం. లేదంటే.. ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ అశోక్‌ ఎందుకు పరారీలో ఉంటాడు. ఇదే విషయాన్ని అటు కేటీఆర్‌ - ఇటు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ కూడా ప్రెస్‌ మీట్‌ లో ప్రస్తావించారు. అయితే.. ఎప్పటికైనా ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే కనిపెట్టిన ఐటీ గ్రిడ్స్ అశోక.. విలువైన డేటా మొత్తాన్ని అమెజాన్‌ - గూగల్‌ లో సేవ్‌ చేశాడు. అంటే.. ఐటీ గ్రిడ్స్‌ క్లోజ్‌ అయినా - సేవా మిత్ర యాప్‌ ని డిలీట్‌ అయినా కూడా మన సమాచారం మొత్తం అమెజాన్‌ - గూగూల్‌ లో అశోక్‌ క్రియేట్‌ చేసుకున్న యూజర్‌ ఐడీ - పాస్‌ వర్డ్‌ తో భద్రంగా ఉంటాయన్నమాట. దీంతో.. తెలంగాణ పోలీసులు ఇప్పుడు అమెజాన్‌ - గూగుల్‌ కి నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అమెజాన్‌ - గూగుల్‌ కూడా పోలీసులు ఆదేశాలకు వెంటనే స్పందించాయి.  సమాచారం మొత్తం రెండు రోజుల్లో ఇస్తామని ప్రకటించాయి. ఒకవేళ నిజంగా అమెజాన్‌ - గూగుల్‌ లో మన డేటా మొత్తం ఉండి ఉంటే.. ఐటీ గ్రిడ్స్‌ని, అతని వెనుక ఉండి నడిపించిన వ్యక్తుల్ని ఎవ్వరూ కాపాడలేడు.



Tags:    

Similar News