ప్రస్తుతం టెక్నాలజీ రాకతో కాదేది అందుబాటులోకి అనర్హం అన్నట్టుగా మారింది. టెక్నాలజీని ఎంత వాడుకుంటే అంత ఈజీగా సంసారం సాగుతోంది. అయితే మంచికి ఉపయోగిస్తే ఉపయోగాలు.. కానీ చెడుకు వాడితే మాత్రం అంతకుమించిన ముప్పు మరొకటి లేదు. కొంతమంది విపరీత బుద్దితో సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీని ఉపయోగించి తమ భాగస్వాములపై నిఘా పెట్టడం కోసం పలవురు స్టాకర్వేర్ యాప్స్ ను ఉపయోగిస్తున్నారు. ఇదే కొంతమందికి అదునుగా మారి ఆయా వ్యక్తుల అవసరాలను క్యాష్ చేసుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా తమ భార్యలు/లవర్స్ జీవిత భాగస్వాములపై నిఘా పెట్టేందుకు స్టాకర్వేర్ యాప్స్ నసు భారీగానే అందుబాటులోకి ఉంచుతున్నారు. ఈ స్టాకర్వేర్ యాప్స్ ద్వారా జీవిత భాగస్వామి ఫోన్ మెసేజ్ లు, కాల్ లాగ్ లు, లోకేషన్, ఇతర వ్యక్తిగత కార్యకలాపాలను తెలుసుకుంటున్నారు. ఈ స్టాకర్వేర్ యాప్స్ ఫోన్ లో ఉన్నాయనే విషయాన్ని కూడా గుర్తు పట్టడం చాలా కష్టం.
తాజాగా స్టాకర్వేర్ యాప్స్ పై గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. స్టాకర్వేర్ యాప్స్ ను ప్రోత్సహించే యాప్స్ పై గూగుల్ ఉక్కుపాదం మోపింది. వీటికి సంబంధించిన యాడ్స్ ను కూడా గూగుల్ యాడ్స్ లో కనిపించకుండా చేసింది. జీవిత భాగస్వాములపై నిఘా పెట్టే యాప్స్ గూగుల్ కఠినవైఖరిని అవలంభిస్తోందని గూగుల్ ప్రకటించింది.
కొన్ని యాప్స్ అనేక పద్ధతులను ఉపయోగించి స్టాకర్వేర్ యాప్స్ ను ప్లే స్టోర్ లో చొప్పించే ప్రయత్నాలను చేస్తున్నట్టుగా గూగుల్ తెలిపింది. స్టాకర్వేర్ యాప్స్ పై గూగుల్ ఎప్పటికప్పుడు నిఘా పెడుతుందని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు.
ఇక భారత్ లోనూ ఈ ‘స్టాకర్వేర్’ యాప్స్ ఎక్కువేనని సైబర్ సెక్యూరిటీ కాస్పర్ స్కై నివేదిక తెలిపింది. ఈ యాప్స్ తో భారత్ లో సుమారు 4627 మంది ప్రభావితమైనట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా స్టాకర్వేర్ యాప్స్ తో 2019లో 67500 మంది, 2020లో 53870మంది ప్రభావితమయ్యారు.