అద్భుతం ఆవిష్కారమైంది.. 500 ఏళ్ల క్రితం నదిలో మునిగిపోయిన పురాతన దేవాలయం బయటపడింది. ప్రజలను సంభ్రమాశ్చార్యాలలో ముంచింది. దీంతో ప్రజలు పూజలు చేస్తూ తనివి తీరుతున్నారు.
ఈ అద్భుతం ఒడిశా రాష్ట్రంలోని నాయగర్ జిల్లాలో చోటుచేసుకుంది. సుమారు 500 ఏళ్ల క్రితం కటక్ లోని మహానది తీరంలోని నీటిలో మునిగిపోయిన ఓ పురాతన గుడి ఇప్పుడు బయటపడడం విశేషంగా మారింది.
ఈ పురాతన ఆలయాన్ని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ కు చెందిన పురావస్తు సర్వే బృందం ఇటీవల కనుగొంది. పద్మావతి గ్రామంలోని సతపటన వద్ద నది అంతా గాలిస్తుండగా ఈ ఆలయం గుర్తించినట్టు తెలిపారు.
మహావిష్ణువు రూపమైన ‘గోపీనాథ్’ దేవాలయం ఇదీ అని.. కటక్ సమీపంలోని పద్మావతి ప్రాంతంలో బైదేశ్వర్ వద్ద నది మధ్యలో ఈ గుడి పైభాగాన్ని కనుగొన్నారు. 60 అడుగుల ఎత్తున్న ఈ పురాతన ఆలయం 15-16వ శతబ్ధానికి చెందినదిగా పేర్కొన్నారు.
గత సంవత్సరకాలంలో నది నీటిమట్టం తగ్గడం వల్ల ఈ ఆలయం బయటపడింది. కాగా 11 ఏళ్ల కిందట వేసవిలో చివరిసారిగా ఈ గుడిపైభాగం కనిపించింది. ఈ వేసవిలో ఎండలకు మరోసారి బాగా బయటపడింది.
ఈ ప్రాంతంలో సుమారు 22 దేవాలయాలు నదిలో మునిగాయని స్థానికులు తెలిపారు. ఎత్తైనది ఈ గోపీనాథ్ ఆలయమేనని అంటున్నారు.