అవును.. రూ.30లకే కోరినంత చికెన్ మీల్. ఇంతకు మించిన బంఫర్ ఆఫర్ ఏముంటుంది చెప్పండి? చికెన్ మీల్ ఏంది? రూ.30లకే ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఏదైనా సంస్థ ప్రమోషనల్ ఆఫర్ అయి ఉంటుందనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. ఇలాంటి ఆఫర్ ను ఇచ్చిందెవరంటే?
కొవిడ్ 19 వైరస్ మహమ్మారి జనాల్ని ఎంతలా వణికిస్తుందనటానికి దారుణంగా పడిపోయిన చికెన్ ధరల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ప్రస్తుతం కేజీ చికెన్ వంద.. రూ.120 అంటున్నా కొనేందుకు ముందుకు రాని పరిస్థితి. కొవిడ్ వైరస్ కు.. కోడికి సంబంధం లేదని ఎంతలా మొత్తుకున్నా ఎవరూ నమ్మని పరిస్థితి. ఒకవేళ.. నమ్మినా.. ఎందుకు రిస్క్ అన్న భావనతో చికెన్ కు దూరంగా ఉంటున్న పరిస్థితి. దీంతో ఫౌల్ట్రీ పరిశ్రమ దారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇక.. ఈ రంగానికి చెందిన వ్యాపారులు దారుణమైన నష్టాల్ని ఎదుర్కొంటున్నారు.
ఇలాంటి వేళ.. చికెన్ మీదున్న కొవిడా భయాల్ని తొలగించేందుకు ఆ పరిశ్రమ ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. చికెన్ మీదున్నఅపోహల్ని తొలగించటం.. అవగాహన పెంచటం తో పాటు.. చికెన్ అమ్మకాల్ని పెంచటమే లక్ష్యంగా రంగంలోకి దిగారు. యూపీలోని గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ ఎదురుగా చికెన్ ఫెస్ట్ ను ఏర్పాటు చేశారు. రూ.30లకే అన్ లిమిటెడ్ చికెన్ మీల్ అంటూ భారీగా చేసిన ప్రచారానికి తగ్గట్లే ప్రజలు పోటెత్తారు. మామూలుగా చికెన్ కొనేందుకు వెనుకాడుతున్న తీరుకు భిన్నంగా ఈ బంఫర్ ఆఫర్ ను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. వందలాదిగా వచ్చిన జనాలతో గంటల వ్యవధిలోనే వెయ్యి కేజీల చికెన్ ఇట్టే సేల్ అయిపోయింది.
అంతేకాదు.. ఈ ఫెస్ట్ కారణంగా భారీ ట్రాఫిక్ జాం చోటు చేసుకుందని చెబుతున్నారు. కొవిడా 19 వైరస్ కారణంగా చికెన్.. గుడ్లు తినకూడదన్నది కేవలం అపోహ మాత్రమేనని.. ఆ అనుమానంలో ఏ మాత్రం నిజం లేదని వైద్యులు చెబుతున్నారు. చైనా వాతావరణ పరిస్థితుల కారణంతో పాటు.. సగం ఉడికించిన ఆహారమే కొవిడ్ వైరస్ లాంటివి చెలరేగిపోయేందుకు కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో సగటు ఉష్ణోగ్రతలు 30 నుంచి 35 మధ్య ఉండగా.. మనం ఆహార పదార్థాల్ని వంద సెంటిగ్రేడ్ వరకు ఉడికించి తయారు చేస్తున్న నేపథ్యంలో కొవిడ్ వైరస్ మన దరిదాపుల్లోకి వచ్చే అవకాశమే లేదని చెబుతున్నారు. చూస్తుంటే.. ఇలాంటి కార్యక్రమాలు.. భారీ ఆఫర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తే పరిస్థితుల్లో మార్పు వస్తుందేమో చూడాలి.