ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇపుడు జాతీయ స్థాయిలో మారిమోగిపోతున్నారు. ఎవరీ ఎంపీ గారు, ఏంటీ ఈయన గారి వ్యవహారం ఏమా సంగతి అంటూ దేశమంతా ఏపీ వైపు చూస్తోంది. వైసీపీ నేతలు తరచూ గొప్పగా చెబుతూ ఉంటారు.
దేశమంతా ఏపీలో జగన్ పాలనను చూస్తోందని, ఆసక్తి గా చర్చించుకుంటోందని, దాని సంగతేమో తెలియదు కానీ ఇపుడు గోరంట్ల మాధవ్ ది అని చెప్పబడుతున్న న్యూడ్ వీడియో కాల్ తో దేశం ఉలిక్కిపడి ఈ వైపుగా చూస్తోంది. లేకపోతే ఎక్కడో పంజాబ్ కాంగ్రెస్ ఎంపీకి ఏమిటి సంబంధం. ఆయన అయితే గోరంట్ల ఎపిసోడ్ పార్లమెంట్ కి మాయని మచ్చ అని తీవ్రమైన మాటే వాడేశారు.
అంతేకాదు ఈ విషయం మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్ కి లేఖ రాశారు. ఫిర్యాదు చేశారు. దాంతో జాతీయ మహిళా కమిషన్ ఈ విషయం మీద దృష్టి పెట్టింది.
మరో వైపు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా మాధవ్ ది అని చెప్పబడుతున్న న్యూడ్ వీడియో విషయం మీద ఫిర్యాదులు వరసబెట్టి వస్తున్నాయి. దీంతో వైసీపీ ఎంపీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అదే టైం లో వైసీపీకి కూడా ఈ వ్యవహారం ఏమీ పాలుపోయేలా కనిపించడంలేదు.
ఇకపోతే ఒక మహిళతో ఎంపీ నగ్నంగా మాట్లాడుతున్నట్లుగా వీడియో రావడం పట్ల కాంగ్రెస్ పార్టీ నేత పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ పార్లమెంటు సభ్యుడు జస్బీర్ సింగ్ గిల్ స్పీకర్ కి ఫిర్యాదు చేశారు.
అంతే కాదు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా లేఖ రాసి ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ కే తలవంపులు ఇలాంటి ఘటనలు అంటూ ఆ కాంగ్రెస్ ఎంపీ వాపోయారు. దాంతో ఇపుడు గోరంట్ల మాధవ్ వ్యవహారం ఉచ్చు బిగిసినట్లుగా బిగుస్తోందనే అంటున్నారు. చూడాలి మరి ఇంకా ఎంత దూరం వెళ్తుందో. ఎందరికీ షేక్ చేస్తుందో.