గోరంట్ల వీడియో: వంగలపూడి అనితకు వైసీపీ కార్యకర్త బెదిరింపులు

Update: 2022-08-09 12:30 GMT
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వైరల్ కావడంతో ఇప్పుడు టీడీపీ నేతలు అదే టాపిక్ పై ప్రజల్లోకి తీసుకెళుతూ వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత, మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా తాజాగా గోరంట్ల మాధవ్ వీడియోను లేవనెత్తారు.  దీనికి రెచ్చిపోయిన ఓ వైసీపీ కార్యకర్త నేరుగా వంగలపూడి అనితకు ఫోన్ చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నారంటూ బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలోనే అనిత మీడియా ముందు చూపించింది.

అనిత మీడియా సమావేశంలో ఉండగానే ఈ ఫోన్ రావడంతో అనిత్ మొబైల్ స్పీకర్ ఆన్ చేసి మరీ విలేకరులకు వినిపించారు. 'ఎంపీ వీడియోపై ప్రభుత్వం విచారణ చేస్తోందని.. అలాంటప్పుడు అతిగా స్పందించాల్సిన పని ఏంటని' ఫోన్లో అనితను వైసీపీ కార్యకర్త నిలదీశాడు.

దీనికి 'ఏం నన్ను బెదిరిస్తున్నావా?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ ఎందుకు మాట్లాడకూదని.? మీ ఎంపీ తప్పు చేస్తే నిలదీయకుండా చేతులు ముడుచుకొని కూర్చోవాలా? లోకేష్ బాబు, బోండా ఉమా? ఏం చేశారు? నన్ను బెదిరించడం దేనికి? దమ్ముంటే నీ దగ్గరున్న ఆ వీడియోలు బయటపెట్టు? ఇంతకీ మీ ఎంపీ చేసింది తప్పే అని నువ్వు అనుకుంటున్నావా? లేదా? అతడిపై ఎందుకు చర్య తీసుకోలేదని' అని ప్రశ్నించింది.

వైసీపీ నేతలు ఆడపిల్లల ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లను గెలిపించవద్దంటూ అనిత హితవు పలికారు. తప్పు చేయలేదనుకుంటే అదే మాట మీ పార్టీ చేత చెప్పించు చూద్దాం అంటూ కడిగేయడంతో అతడు మీకో దణ్ణం అంటూ ఫోన్ పెట్టేశారు.  

 ఆ వీడియోపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా అనిత తీవ్రంగా స్పందించారు. 'గంట, అరగంట అశ్లీల ఆడియోలు బయటకు వచ్చాయి. అవి నిజం అని ప్రపంచమంతా తెలుసు. అవి తమవి కాదు అని వాళ్లే చెప్పారంట.. అందుకే అవి వారివి కాదు అని ఇతగాడు సర్టిఫికెట్ ఇస్తున్నాడని.. వాళ్ల రోత మహారోత అని.. డర్టీ ఎంపీ మాధవ్ మీద చర్యలేమీ ఉండవు అని పరోక్షంగా చెప్పేశారని అనిత ట్వీట్ చేశారు.

వైసీపీలో ఇలా బయటపడ్డ అందరిపై చర్యలు తీసుకోవడం మొదలుపెడితే పార్టీ ఖాళీ అయిపోతుందనే భయంతోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అనిత ఆఱోపించారు. కనీసం అతడి వికృత చేష్టలను ఖండించలేదని.. అతడిపై చర్యలు తీసుకోమని మేము ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ఇప్పుడు మాపైనే బెదిరింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Full View

Tags:    

Similar News