ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న రిజిస్ట్రేషన్ విధానాన్ని సమూలంగా మార్చటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. అలాంటి విషయంలోనూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన మార్కు చూపించారు. అయితే ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ల వ్యవస్థ స్తంభించి చాలామందిని ఇబ్బందుల పాలు చేసింది. ప్రభుత్వానికి ఆదాయాన్నీ పోగొట్టింది. వ్యవసాయ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసేందుకు ధరణి పోర్టల్ ద్వారా సరికొత్త విధానాన్ని ఈ మధ్యనే తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. అందులోను ఇబ్బందులు తప్పలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విధానంలో మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మొత్తం తొమ్మిది రకాల సవరణల్ని.. వ్యవసాయ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుగా మార్పులు చేసేందుకు రెఢీ అయ్యింది.
ఇందుకు తాజాగా విధి విధానాల్ని సిద్ధం చేసింది. దీంతో.. పాస్ పుస్లకంలో తప్పులు నమోదైన తర్వాత వాటిని సరి చేసుకోవటానికి ఇప్పటివరకు ఎలాంటి అవకాశం లేదు. తాజా నిర్ణయంతో తప్పుల్ని సరిదిద్దుకునేందుకు అవకాశాన్ని ఇచ్చింది. ఆధార్ నమోదులో తప్పులు.. ఆధార్ వివరాలు సమర్పించకపోవటం.. తండ్రి లేదా భర్త పేరులో తప్పులు.. కులం మార్పు.. సర్వే నెంబరు మిస్సింగ్.. పాస్ పుస్తకాల్లో భూమి రకం మార్పు లాంటి వాటిని ఛేంజ్ చేసుకోవాలంటే అందుకు అవకాశాన్ని ఇచ్చింది.
కొత్త పాస్ పుస్తకాల మంజూరుకు బయోమెట్రిక్ తప్పనిసరి కావటంతో తెలంగాణ రాష్ట్రంలోని మీ-సేవ కేంద్రాలకువెల్లి సవరణల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.అయితే.. మీ సేవా కేంద్రాల్లో మార్పుల కోసం చేసుకున్న దరఖాస్తుల్ని నేరుగా కలెక్టర్ కు పంపుతారు. అక్కడ వారు పరిశీలించిన తర్వాత సదరు దరఖాస్తును అవుననో.. కాదనో తిరస్కరించటం ఉంటుంది.
ఇంతకూ ఏ మార్పునకు ఏమేం చేయాలి? అందుకు సమర్పించాల్సిన డాక్యుమెంట్ల సంగతి చూస్తే..
సవరణ అంశం ఏ డాక్యుమెంట్ ఇవ్వాలి?
1. ఆధార్ నమోదులో తప్పులు అప్లికెంట్ ఆధార్ కార్డు
2. ఆధార్ వివరాలు లేకుంటే దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు
3. తండ్రి లేదా భర్త పేరులో తప్పు వారికి సంబంధించిన ఓటరు.. పాన్.. డ్రైవింగ్ లైసెన్స్
4. ఫోటో సరిలేకుంటే.. దరఖాస్తుదారుడి సరైన ఫోటో
5. జెండర్ తేడాగా నమోదు చేసి ఉంటే దరఖాస్తుదారుడి ఫోటో
6. కులం మార్పు (గిరిజన ప్రాంతాల్లో కాకుండా) మీ సేవలో ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రం
7. సర్వే నెంబరు మిస్సింగ్ కొత్త.. పాత పాస్ బుక్కులు.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్
8. భూసేకరణ జరిగిన భూములకు కొత్త.. పాత.. పాస్ పుస్తకం, ఇతర సాక్ష్యం
9. భూమి తీరు మార్పు కొత్త.. పాత పాస్ పుస్తకం.. ఇతరసాక్ష్యాలు