పాత నోటుకు అయిదు రెట్ల ఫైన్

Update: 2016-12-27 07:35 GMT
నోట్ల రద్దు నిర్ణయం తరువాత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు జనాన్ని షాక్ కు గురిచేస్తున్నాయి. తాజాగా మరో ఆర్డినెన్సు తేనుందన్న సమాచారం బ్లాక్ షీప్స్ ను వణికిస్తోంది.  రద్దయిన పాత 500 నోట్లు - వెయ్యి రూపాయల నోట్లు పదివేలు.. అంతకన్నా ఎక్కువ దగ్గర ఉంచుకున్నా.. ఎవరి నుంచైనా తీసుకున్నా.. లేదా ఎవరికైనా బదిలీ చేసినా వారు శిక్షార్హులయ్యేలా కొత్త నిబంధన తేవాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు.  ఇందుకోసం ఆర్డినెన్సు తేవడమో లేదా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ విడుదల చేయడమో జరగవచ్చునని తెలుస్తోంది.
    
రద్దయిన నోట్లలో కేవలం పది నోట్లు మాత్రమే ఎవ్వరైనా కలిగిఉండేలా నిబంధన చేర్చబోతున్నారట.  ఆ పది నోట్లు ఏవైనా కావచ్చు. అవి ఐదొందల నోట్లయినా ఉండొచ్చు. లేదా వెయ్యి రూపాయల నోట్లయినా అయి ఉండొచ్చు. అలాంటివి పదికి మించి ఉండరాదన్నది ప్రభుత్వ నిబంధనగా చేర్చే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్సు ఈ నెల 30వ తేదీలోగా విడుదల కావచ్చునని అంటున్నారు. బ్యాంకు అకౌంట్లలో పాతనోట్లు డిపాజిట్‌ చేసుకునేందుకు ఈ నెల 30 తుదిగడువు అన్న సంగతి తెల్సిందే. ఆలోగానే ఆర్డినెన్సు వచ్చే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్ష వేయాలన్నది ఇంకా తర్జనభర్జనలోనే ఉన్నట్టు తెలుస్తోంది. కనీసం యాభై వేల రూపాయల జరిమానా విధించేలా నిబంధన పెడతారని టాక్.
    
అంతేకాదు.. దీన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తారు. మున్సిపల్‌ మేజిస్ట్రేట్‌ ఈ కేసుల్ని విచారించి శిక్షలు ఖరారు చేస్తారు. రిజర్వు బ్యాంకు డైరక్టర్ల సెంట్రల్‌ బోర్డు సిఫార్సుల మేరకు ఆర్డినెన్సులో నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News