గవర్నర్లను అడ్డం పెట్టుకుని రాష్ట్రప్రభుత్వాలను నియంత్రించటం అన్నది నరేంద్రమోడీ ప్రభుత్వానికి మామూలైపోయింది. ఇప్పటికే ఈ పద్దతి పశ్చిమబెంగాల్, ఢిల్లీ, జార్ఖండ్, మొన్నటివరకు మహారాష్ట్రలో జరిగింది. ఇప్పుడిప్పుడే తెలంగాణాలో కూడా మొదలయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఇలాంటి పద్దతే పంజాబ్ లో కూడా మొదలైపోయింది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఇచ్చిన అనుమతిని గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ రద్దుచేశారు.
ఇంతకీ విషయం ఏమిటంటే పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుండి ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్ నానా రచ్చ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ను టార్గెట్ చేస్తు పాత విషయాలను పదే పదే తవ్వి తీస్తున్నాయి.
ఈ నేపధ్యంలోనే జర్మనీలో లుఫ్తాన్సా విమానంలో నుండి భగవంత్ ను విమానసిబ్బంది దింపేశారంటు గోలమొదలైంది. బాగా మందుతాగి విమానంలోకి ఎక్కిన కారణంగా సీఎంను విమాన సిబ్బంది దింపేశారని అక్కడ ఒక వెబ్ సైట్లో వచ్చిన వార్తను పంజాబ్ లో ప్రతిపక్షాలు పట్టుకున్నాయి.
ఈ ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. లుఫ్తాన్సా సిబ్బంది కూడా దీన్ని ఎక్కడా ధృవీకరించలేదు. చివరి నిముషంలో విమానాన్ని మార్చాల్సి రావటం వల్లే జర్మనీ నుండి ఢిల్లీకి రావాల్సిన విమానం ఆలస్యమైందని మాత్రమే చెప్పింది. అయితే యాజమాన్యం చెప్పింది వినకుండా ప్రతిపక్షాలు పదేపదే సీఎం రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నేపధ్యంలోనే అసెంబ్లీలో విశ్వాసపరీక్ష నిర్వహించాలని ఆప్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇందుకు ప్రత్యేకంగా సమావేశాలను నిర్వహించాలని కూడా అనుకున్నది. ఇదే విషయమై ప్రభుత్వం గవర్నర్ కు సమాచారమిచ్చింది. అందుకు గవర్నర్ కూడా ఓకే చెప్పారు.
అయితే తర్వాత ఏమైందో ఏమో కానీ హఠాత్తుగా ప్రత్యేక సమావేశాల అనుమతిని గవర్నర్ వెనక్కు తీసుకున్నారు. ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నిబంధనలు అంగీకరించవని నిపుణులు చెప్పారని గవర్నర్ కార్యాలయం చెప్పటం గమనార్హం. ముందు ముందు ఇంకెన్ని గొడవలవుతాయో చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.