ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేత ప్రమాణస్వీకారం చేయించేందుకు హైదరాబాద్ నుంచి విచ్చేశారు గవర్నర్ నరసింహన్. గతానికి భిన్నంగా ఈసారి జగన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ తో పాటు.. ఆయన సతీమణి విమలా నరసింహన్ కూడా హాజరయ్యారు. ప్రమాణస్వీకారోత్సవం కోసం మహా అయితే పది నిమిషాలు కూడా వేదిక మీద ఉండలేదు గవర్నర్ దంపతులు.
వేదిక మీదకు వచ్చిన వెంటనే.. జాతీయ గీతం.. అనంతరం.. జగన్ మోహన్ రెడ్డి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన ఆయన.. అభినందనలు తెలిపి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. వేదిక మీద నుంచి దిగి వెళ్లే ముందు.. గవర్నర్ దంపతులు విజయమ్మఉన్న వైపు వెళ్లారు.
ఆమెను పలుకరించిన తర్వాత.. షర్మిల.. భారతిలను పలుకరించారు. ఆ తర్వాత అక్కడి వారిని జగన్ కుమార్తెలు ఎవరంటూ వాకబు చేశారు. దీంతో.. వెనుక వరుసలో ఉన్న ఇద్దరు కమార్తెలు.. తమను పరిచయం చేసుకున్నారు. వారిని చూసిన గవర్నర్ దంపతులు.. వారిని ఆశీర్వదించి వెళ్లారు. ప్రత్యేకంగా జగన్ కుమార్తెల గురించి గవర్నర్ దంపతులు ఆసక్తిగా అడగటం గమనార్హం.