తెలంగాణతో నరసింహన్ రుణం తీరిపోయినట్లేనా?

Update: 2019-09-01 04:51 GMT
గతంలో ఎప్పుడూ లేని రీతిలో రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్.. గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఉంటున్నారు. యూపీఏ హయాంలో గవర్నర్ గా ఎంపికైన ఆయన.. మోడీ సర్కారు తొలి ఐదేళ్లలోనూ గవర్నర్ గిరిని కంటిన్యూ చేసిన ఆయన.. రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే గవర్నర్ గా కొనసాగుతున్నారు.

సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలంగాణ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టిన మోడీషాలు.. గవర్నర్ నరసింహన్ కు స్థానచలనం చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్లే ఇటీవల రాజ్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో నరసింహన్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరేలా ఉన్నాయి. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సన్మానం చేసినసమయంలో.. తాను గవర్నర్ గా ఉన్నా లేకున్నా 2020 ఒలంపిక్స్ లో బంగారు పతకం సాధించి రాజ్ భవన్ కు రావాలన్న ఆయన మాటలు ఆసక్తికరంగా మారాయి.

తెలంగాణ మీద పట్టు బిగించే పనిలో భాగంగా తొలుత నరసింహన్ ను బదిలీ చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉందంటున్నారు. ఆయన స్థానంలో కేరళ గవర్నర్ సదాశివంను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నరసింహన్ మార్పునకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇవాళ.. రేపు అన్నట్లుగా ఉందంటున్నారు. ఏమైనా.. ఉమ్మడి రాష్ట్రంలోనూ.. రాష్ట్ర విభజన తర్వాత తనకు తిరుగులేని రీతిలో కొనసాగిన గవర్నర్ తెలంగాణను వీడే రోజు దగ్గర్లోనే ఉందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
Tags:    

Similar News