గ‌వ‌ర్న‌ర్ అర్జెంట్‌ గా ఢిల్లీ ఎందుకెళ్లారు?

Update: 2016-02-08 09:33 GMT
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ స‌డెన్‌ గా ఢిల్లీకి వెళ్లారు! గ‌వ‌ర్న‌ర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న గురించి ఎపుడైనా ముంద‌స్తుగా స‌మాచార‌మో, మీడియాలో వార్త‌లో వ‌స్తుంటాయి. కానీ తాజాగా అదేమీ లేకుండా గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ హ‌స్తినాకు ప్ర‌యాణ‌మ‌య్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో కాపుల ఉద్య‌మం పెద్ద ఎత్తున ర‌గులుతున్న నేప‌థ్యంలో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయి. మ‌రోవైపు ఇరు రాష్ర్టాల ఉమ్మ‌డి రాజ‌ధాని అయిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ ఎస్ పార్టీ విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది.

విశ్వ‌స‌నీయవ‌ర్గాల స‌మావేశం మేర‌కు ఢిల్లీలో రేపు జ‌రిగే గవర్నర్ల కాన్ఫరెన్స్‌ లో గవర్నర్ మ‌న గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ పాల్గొంటారు. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్ నుంచి బ‌య‌ల్దేరిన న‌ర‌సింహ‌న్ ఢిల్లీలోని ఏపీ భవన్‌ కు చేరుకున్నారు. హ‌స్తినాలో రెండు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. గ‌వర్న‌ర్ల స‌ద‌స్సుతో పాటు రెండ్రోజుల టూర్‌ లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లతో భేటీ కానున్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయా రాష్ర్టాల్లో ఉన్న శాంతిభ‌ద్ర‌త‌ల పరిస్థితి, తాజాగా జ‌రుగుతున్న కాపుల రిజ‌ర్వేష‌న్, ఇటీవ‌ల మ‌ర‌ణించిన విద్యార్థి రోహిత్ వివాదం త‌దిత‌ర అంశాలు చ‌ర్చ‌కు రానున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో పాటు గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాలపై కూడా చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News