ఈసారి బాబును ఓడించిన ఉద్యోగులు!

Update: 2019-05-23 07:13 GMT
ఎన్నిక‌ల ఫ‌లితాలు పూర్తిగా రాకున్నా.. అధిక్య‌త‌ల మీద ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న వ‌చ్చేసింది. వార్ వ‌న్ సైడ్ అన్న విష‌యంపై క్లారిటీ వ‌చ్చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌తో స‌హా మ‌రెవ‌రూ ఊహించ‌ని విధంగా ఆ పార్టీ ప్ర‌స్తుతం 150 సీట్ల‌లో అధిక్య‌త వ‌చ్చేసింది. ఒక‌ట్రెండు తేడా కొట్టినా.. 148కి మాత్రం ఢోకా లేని ప‌రిస్థితి. ఒక‌వేళ‌.. మ‌రింత క‌లిసి వ‌స్తే.. 150 ప్లస్ సీట్ల‌లో విజ‌యం సాధించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేని ప‌రిస్థితి.

జ‌గ‌న్ ఘ‌న విజ‌యం సంగ‌తి ఇలా ఉంటే.. బాబు ఇంత దారుణంగా ఎందుకు ఓడిపోయారు? అన్న‌దిప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. గ‌తంలో ఉద్యోగుల్ని రాచి రంపాన పెట్టిన కార‌ణంగా ఓడిన చంద్ర‌బాబు.. ఈసారి వారిని పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌న్న పేరుంది. అయిన‌ప్ప‌టికీ.. ఉద్యోగులు బాబు విష‌యంలో అసంతృప్తిగా ఉన్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది.

గ‌తంలో మాదిరే ఈసారి ఉద్యోగులు బాబును రిజెక్ట్ చేసిన వైనం ఫ‌లితాల్ని చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఈ వాద‌న‌కు బ‌లం చేకూరేలా ఓట్ల లెక్కింపు ముందు లెక్కించిన పోస్ట‌ల్ బ్యాలెట్ పేప‌ర్ల లెక్క‌ను చూస్తే.. బాబు స‌ర్కారు మీద ప్ర‌భుత్వ ఉద్య‌గుల్లో ఎంత వ్య‌తిరేక‌త ఉంద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంది.

చంద్ర‌బాబు ఎప్పుడు ముఖ్య‌మంత్రి అయినా ఉద్యోగులపై ప‌ని భారాన్ని పెంచేయ‌టం.. విప‌రీత‌మైన ఒత్తిడికి గురి చేయ‌టం.. పార్టీ ప‌నుల‌కు కూడా ఉద్యోగుల్ని వాడేస్తార‌న్న విమ‌ర్శ ఉంది. దీనికి త‌గ్గ‌ట్లే.. ఉద్యోగుల పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌లో భారీగా జ‌గ‌న్‌కు ప‌డ‌టం చూస్తే.. బాబుకు వారు షాకిచ్చార‌న్న‌ది స్ప‌ష్ట‌మవుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News