లాక్ డౌన్ ఎపిసోడ్ లో మోడీ సర్కారుకు పెరిగిన ఇమేజ్ అంతా ఇంతా కాదన్నట్లుగా కమలనాథులు గొప్పలు చెప్పుకోవటం చూస్తున్నప్పుడు నోటెంట మాట రాని పరిస్థితి. ఓపక్క ప్రజలు ప్రాణాలతో పోరాడుతున్న వేళ.. తమ నాయకుడి గొప్పతనాన్ని కీర్తించేందుకు బీజేపీ నేతలు చేస్తున్నప్రయత్నాలు వెగటు పుట్టిస్తున్నాయంటూ ఆయా రాష్ట్రాలు మండిపడుతున్నాయి. లాక్ డౌన్ ఎపిసోడ్ లో మోడీ సర్కారు తీరుపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమైనా.. వలసకార్మికుల్ని వారి సొంతూళ్లకు చేర్చే విషయంలో మోడీ సర్కారు అనుసరించిన వైనంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేనా.. వలసలపై కేంద్రం అనుసరించిన తీరు మోడీ సర్కారు ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసిందని చెప్పాలి.
శ్రామిక్ రైళ్ల పేరుతో వసూళ్లు చేపట్టిన కేంద్రం తీరుపై రాష్ట్రాలు ఇప్పటికే మండిపడుతున్నాయి. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు లోలోన ఉడికిపోతున్నప్పటికి మాట్లాడటం లేదు. అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విపత్తు వేళ.. వ్యాపార ధోరణి ఏమిటి? టికెట్ల ఛార్జీ కంటే ఎక్కువగా వసూలు చేయటం ఏమిటి? డబ్బులు కడితే కానీ రైళ్లు పంపలేదు? అంటూ ఆ మధ్యన తాను నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు కేసీఆర్.
ఇదిలా ఉంటే.. ఈ విమర్శలకు భిన్నంగా కేంద్ర ఆర్థిక.. కార్పొరేట్ వ్యవహారాల సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మాటలు వేరుగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అడిగిన వెంటనే కేంద్రం ప్రత్యేక రైళ్లను సమకూర్చటంతో పాటు.. ఉచితంగా ఆహారం.. మంచినీళ్లు అందించినట్లుగా చేసిన వ్యాఖ్యలపై పలు రాష్ట్రాలు మండిపడుతున్నాయి. శ్రామిక్ రైళ్ల విషయంలో కేంద్రం తీరుపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న రాష్ట్రాలకు.. తాజాగా కేంద్రమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు మరింత కాలేలా ఉన్నాయని చెబుతున్నారు. ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేసిన తర్వాత మాత్రమే రైళ్లను ఏర్పాటు చేసిన వైనాన్ని ఎలా మర్చిపోతారంటున్నారు. రానున్న రోజుల్లో అనురాగ్ సింగ్ ఠాకూర్ కు వివిధ రాష్ట్రాలు పంచ్ లు ఇవ్వటం ఖాయమంటున్నారు.