న్యూజిలాండ్ లో విదేశాంగ మంత్రిగా ‘గే’ ...ప్రధాని జేసిండా కీలక నిర్ణయం !
న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. కరోనా మహమ్మారి సమయంలో, న్యూజిలాండ్ లో కఠినమైన నియమాలని అమలు చేసి కరోనా మహమ్మారిని నిర్ములించి ప్రపంచానికి తన సత్తా ఏంటో చాటింది. ఇక రెండోసారి ప్రధానిగా ఎంపికైన జేసిండా ఓ సంచలననిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని అత్యంత వైవిధ్యమైన పార్లమెంటులలో ఒకటిగా తీర్చి దిద్దుతున్నారు. మాజీ ఆర్థిక మంత్రి గ్రాంట్ రాబర్ట్ సన్ ను ఉప ప్రధానమంత్రిగా ప్రకటించారు. అంతేకాదు విదేశాంగ మంత్రిగా నానియా మహూతాను నియమించారు. 20మంది సభ్యుల మంత్రివర్గంలో ఐదుగురు కొత్త మంత్రులను తీసుకున్నారు. కరోనా వైరస్‌తో ఏర్పడిన లాక్‌డౌన్ వల్ల ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలం చేస్తున్న సమయంలో హెలికాప్టర్ మనీ అంటూ తీవ్రచర్చకు తెరతీసిన గ్రాంట్ రాబర్ట్ సన్ మరోసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు.
గడ్డం మీద పచ్చబొట్టుతో నాలుగేళ్ల క్రితం దేశంలోని మొట్టమొదటి మహిళా పార్లమెంటు సభ్యురాలిగా గుర్తింపు తెచ్చుకున్న మహూతా తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నారు. విదే శాంగమంత్రి పదవి చేపట్టనున్న తొలి స్వలింగ సంపర్కురాలు మెహుతా. మునుపటి విదేశాంగ మంత్రి విన్‌స్టన పీటర్స్ కూడా మావోరికి చెందిన వారే కావడం మరో ముఖ్యమైన విషయం. మరోవైపు భారత సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్ జెసిండా మంత్రివర్గంలో చోటు సంపాదించారు. కమ్యూనిటీ, వాలంటరీ సెక్టార్ మంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించ నున్నారు. గృహ హింస బాధిత మహిళలు, వలస కార్మికుల తరపున పోరాడుతున్న ప్రియాంకా 2017లో తొలిసారి లేబర్ పార్టీ తరపున పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇటీవల ఎన్నికల్లో రెండోసారి ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించిన జెసిండా తాజాగా తన క్యాబినెట్‌ను విభిన్నంగా తీర్చిద్దిదారు. ప్రతిభ, యోగ్యత కలిగినవారికే తన మంత్రివర్గంలో చోటిచ్చామని ఇందుకు చాలా గర్వంగా ఉందని ఆమె ప్రకటించారు. రాబోయే మూడేళ్ళు తాము సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందని ప్రధాని జెసిండా వెల్లింగ్టన్ లో విలేకరులతో చెప్పారు.