నగరి టికెట్ కోసం టీడీపీలో పోటీ పెరిగింది. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణంతో టీడీపీ నుంచి ఈసారి నగరి అసెంబ్లీకి ఎవరు పోటీ చేయనున్నారనే అంశంపై కొన్నాళ్లుగా తర్జనభర్జన కొనసాగుతోంది. గాలి ముద్దకృష్ణమ నాయుడు కుటుంబంలోనే సీటు విషయంలో క్లారిటీ లేకపోవడంతో సీఎం చంద్రబాబు కూడా అప్పట్లో జోక్యం చేసుకున్నారు. ఈ విషయంలో ఇప్పటికీ స్పష్టత లేని పరిస్థితి. ఇదిలా ఉండగానే.. టీడీపీ నుంచి నగరి టికెట్ ఆశిస్తున్న మరోనేత తెరపైకొచ్చారు. ఆయనే సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ కె.అశోక్ రాజు. గురువారం ఆయన నిర్వహించిన బైక్ ర్యాలీ ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. గురువారం ఆయన తన కళాశాల విద్యార్థులతో పాటు - కొందరు మద్దతుదారులతో నగరి నియోజకవర్గంలోని మండలాలను చుట్టేస్తూ పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.
టీడీపీ జెండాలతో, టీడీపీ అనుకూల నినాదాలతో నగరి పసుపుమయమైంది. అయితే.. ఇంత జరుగుతున్నా గాలి ముద్దుకృష్ణమ నాయుడి కుటుంబం ఈ ర్యాలీకి దూరంగా ఉండటంతో నగరిలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అశోక్ రాజు కేవలం నగరి టికెట్ కోసం బల ప్రదర్శనలో భాగంగానే ఈ ర్యాలీ చేశారని.. అందుకే గాలి కుటుంబం దూరంగా ఉందనే వాదన వినిపిస్తోంది. కేవలం ఈయన ఒక్కరే కాదు.. టీడీపీలో నగరి టికెట్ కోసం ప్రయత్నిస్తున్న ఆశావహుల జాబితా రోజురోజుకూ పెరుగుతుంటం విశేషం. పుత్తూరుకు చెందిన ఓ మహిళా డాక్టర్ కూడా నగరి టీడీపీ టికెట్ ను ఆశిస్తున్నారు. వైసీపీ నుంచి రోజానే మళ్లీ బరిలో నిలిచే అవకాశాలు మెండుగా ఉండటంతో.. టీడీపీ కూడా మహిళా అభ్యర్థినే రంగంలోకి దింపే అవకాశం ఉందని.. తనకు టికెట్ దక్కుతుందని ఈ మహిళా వైద్యురాలు నగరి టికెట్ పై కోటి ఆశలు పెట్టుకున్నారు.
జిల్లాలో సుదీర్ఘ కాలం నుంచి పార్టీకి సేవలందిస్తున్న చిట్టిబాబు కూడా టికెట్ రేసులో ఉన్నట్లు సమాచారం. ఇలా టికెట్ కోసం పెరుగుతున్న ఆశావహులతో నగరి టీడీపీ కేడర్ గందరగోళంలో పడింది. పార్టీ ఎవరికి అవకాశం కల్పిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. గాలి ముద్దుకృష్ణమ నాయుడు భార్య సరస్వతమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో మళ్లీ అదే కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని జిల్లాకు చెందిన కొందరు సీనియర్లు ఇప్పటికే అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారు. అప్పట్లో సినీ నటి వాణీ విశ్వనాథ్‌ను పార్టీలో చేర్చుకుని నగరి టికెట్ ఇవ్వాలనే యోచనలో టీడీపీ అధినేత ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆమె అయితే సినీ గ్లామర్ కూడా కలిసొస్తుందని టీడీపీ భావించినట్లు ప్రచారం జరిగింది. ఇలా నగరి టీడీపీ టికెట్‌పై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది.