కొత్త సంవత్సరంలో కొంగొత్తగా జీఎస్టీ బాదుడు.. పెరిగేవి ఇవే

Update: 2021-12-27 09:39 GMT
ఒక దేశం.. ఒక పన్ను పేరుతో తీసుకొచ్చిన జీఎస్టీ (వస్తు.. సేవల పన్నుల విధానం) కొత్త సంవత్సరంలో కొంతమేర మారనుంది. తాజాగా చేసిన మార్పులు జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త పన్నుల విధానంలో కొన్ని వస్తు సేవలు ఖరీదు ఎక్కనున్నాయి. అన్నింటికి మించి వస్త్ర పరిశ్రమ మీద విధించిన పన్ను.. ప్రజలకు మరింత భారాన్ని పెంచనుంది.

ఇప్పటివరకు పాదరక్షలు.. అన్ని రకాల టెక్స్ టైల్ ఉత్పత్తులకు.. రెడీమెడ్ గార్మెంట్స్ కు ఇప్పటివరకు అమలు చేస్తున్న 5 శాతం జీఎస్టీ స్థానే 12 శాతం జీఎస్టీని బాదేయనున్నారు. దీంతో.. ఈ ఉత్పత్తులు ఖరీదెక్కనున్నాయి. టెక్స్ టైల్స్ విషయంలో ఒక్క కాటన్ మీద తప్పించి మిగిలిన అన్నీ వస్త్రాల ధరలు పెరగనున్నాయి. పాదరక్షలకు కూడా ఇప్పటివరకు వసూలు చేస్తున్న ఐదు శాతం స్థానే 12 శాతం పన్ను బాదుడు మోగనుంది.

కాస్తోకూస్తో ఊరట కలిగించే అంశం ఏమంటే.. ఈ-కామర్స్ కంపెనీలు కానీ ప్యాసింజర్ రవాణా సర్వీసులు అందిస్తే 5 శాతం రేటు వర్తిస్తుంది. ఆన్లైన్ విదానంలో ఈ సేవలు అందించే ఆటో రిక్షా డ్రైవర్లకు మినహాయింపు ఉండనుంది.స్విగ్గీ.. జొమాటో వంటి ఫుడ్ యాప్ లు అందించే ఈ-కామర్స్ ఆపరేటర్లు జనవరి 1 నుంచి ఆయా హోటళ్ల నుంచి జీఎస్టీ వసూలు చేసి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో.. కస్టమర్లకు అదనపు భారం పడదని చెబుతున్నారు. మొత్తంగా కొత్త సంవత్సరంలో పన్ను బాదుడు నుంచి రిలీఫ్ ఆలోచన రాకుండా కొత్త బాదుడు భారంగా మారనుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News